గతేడాదిలో మీటూ ఉద్యమంపై పోరాడుతూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా.. మరోసారి విరుచుకుపడింది. 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా నిర్మాత సామి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, రాకేశ్ సారంగ్ వంటి ప్రముఖులు తనను వేధించారని కేసు ఫైల్ చేసిన తనుశ్రీ.. తాజాగా మరోసారి వారిపై లేఖాస్త్రాన్ని సంధించింది.

'హార్న్ ఓకే ప్లీజ్' సినిమాకు తనను రికమెండ్ చేసింది గణేష్ ఆచార్య అని వేధింపుల సమయంలో నానా పటేకర్ ని అతడు కాపాడడానికి ప్రయత్నించాడని అందుకే ఎఫ్ఐఆర్ లో ప్రముఖంగా గణేష్ ఆచార్య పేరు ఉందని చెప్పుకొచ్చింది.

తనను కేవలం ఒక్కరు మాత్రమే వేధించలేదని, నలుగురు కలిసి వేధించారని చెప్పింది. బాలీవుడ్ లో తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో గణేష్ ఆచార్య కావాలని తన కెరీర్ నాశనం చేయడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. ఇప్పుడు వీళ్లతో పాటు రాఖీ సావంత్ కూడా తనపై దుర్మార్గంగా ప్రవర్తించిందని తెలిపింది.

నానా పటేకర్, రాకేశ్ సారంగ్, సామీ సిద్ధిఖీ, రాఖీ వీళ్లందరికీ శాపం చెప్పింది. వీరితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు శారీరకంగా, మానసికంగా బాధలకు గురవుతారని, మీకు పుట్టే పిల్లలు మెంటల్ టార్చర్ అనుభవిస్తారని శాపాలు పెట్టింది. పూజలు, దేవుళ్లు సైతం మిమ్మల్ని కాపాడలేరు అంటూ ఒకటికి పదిసార్లు శాపాలు పెడుతూనే ఉంది.  

సంబంధిత వార్తలు.. 

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!