బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని నటి తనుశ్రీదత్తా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో నిజానిజాలు తేలకముందే మరొకరిపై ఆరోపణలు చేస్తోంది తనుశ్రీదత్తా.. బాలీవుడ్ లో ఆమె నటించిన 'చాక్లెట్' సినిమా దర్శకుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని వెల్లడించింది.

ఆమె డైరెక్టర్ పేరు చెప్పనప్పటికీ 'చాక్లెట్' సినిమా డైరెక్ట్ చేసింది వివేక్ అగ్నిహోత్రి. ఆ సినిమా షూటింగ్ సమయంలో అతడు తనను ఎంతగా ఇబ్బంది పెట్టాడో చెబుతూనే.. బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, సునీల్ శెట్టిలు తనకు సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది.

తనను బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమని డైరెక్టర్ బలవంతం పెట్టాడని తనుశ్రీ ఆరోపించింది. నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఎక్స్ ప్రెషన్స్ కోసం ఫ్రేములో తనుశ్రీ లేకపోయినా.. ఆమెని బట్టలిప్పి అతడి ముందు నగ్నంగా డాన్స్ చేయమని డైరెక్టర్ డిమాండ్ చేశాడట.

అయితే వెంటనే ఇర్ఫాన్ ఖాన్, సునీల్ లు అలాంటి డాన్స్ లు ఏవీ అక్కర్లేదని అన్నారట. అప్పుడు వివేక్ సైలెంట్ అయ్యాడని ఇండస్ట్రీలో మంచి వ్యక్తులు కూడా ఉన్నారని ఆమె తెలిపింది. 

సంబంధిత వార్త.. 
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!