బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా.. నటుడు నానాపటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనుశ్రీకి మద్దతుగా పలువురు సినీ తారలు నిలుస్తున్నారు. నానా పటేకర్ అలాంటివాడేనంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

''నానా పటేకర్ పై తనుశ్రీ చేస్తోన్న ఆరోపణలు తీసిపారేయలేం. కానీ ఆమె మరొకసారి తను ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందో ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే నానా పటేకర్ అటువంటి వ్యక్తి కానేకాదు. నానా లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు చాలా అరుదు. కానీ ఆయన గురించి తెలియని వారు మాత్రం తప్పుగా అర్ధం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా మొదట్లో ఆయన ప్రవర్తనతో ఇబ్బంది పడ్డాను. 

సినిమా కథ చెప్పడానికి ఆయనకి ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అంటారు కానీ నానా మాత్రం హా బోల్(చెప్పు) అని చాలా సీరియస్ గా అన్నారు. నేను కథ చెప్పాలనుకుంటున్నానని చెప్పగా సరే రా అని ఫోన్ పెట్టేశారు. ఆయన అడ్రెస్ కనుక్కొని అతి కష్టం మీద ఇంటికి వెళ్లాను. సగం కథ చెప్పిన తరువాత 'టీ తాగుతావా' అని అడిగారు. నేను సరే అన్నాను. అయితే కిచెన్ లోకి వెళ్లి టీ చేసి ఇద్దరికీ తీసుకురా అన్నారు. నేను షాక్ అయిపోయాను.

అసలు నన్ను టీ చేయమనడం ఏంటో అర్ధం కాలేదు. నేను వెంటనే తేరుకొని నాకు టీ చేయడం రాదని చెప్పాను. దానికి ఆయన మీ అమ్మ నీకు ఇదే నేర్పించిందా..? అంటూ మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడారు. మరోసారి బైక్ మీద నుండి ఓ వ్యక్తి రోడ్ మీద ఏదో విసిరేసి వెళ్లిపోయాడు. నానా వెంటనే అతడిని ఆపి సివిక్ సెన్స్ గురించి క్లాస్ తీసుకున్నారు. నానా చెప్పే పద్ధతి హార్ష్ గా ఉండొచ్చు కానీ అతడి ఉద్దేశం కాదు.

ఎదుటివారిని బాధ పెట్టాలనే ఆలోచన అతడికి ఉండదు. తనకు వచ్చే రెమ్యునరేషన్ లో సగాన్ని చారిటీలకి ఇస్తాడు. అది కూడా తన పేరు మీద కాదు.. ఏ సినిమా చేస్తున్నాడో.. ఆ సినిమా నిర్మాతనే నేరుగా చారిటీకి అందించమని చెబుతారు. చారిటీకి తను అందిస్తోన్న సేవ గురించి బయటకి చెప్పాలనుకోడు. తన తల్లిని నానా ఎంత బాగా చూసుకుంటాడో.. మాటల్లో చెప్పలేం.

అటువంటి వ్యక్తి హీరోయిన్ పట్ల తప్పుగా ప్రవర్తించారంటే నమ్మదగిన విషయం కాదు. ఎందుకంటే నానా అటువంటి మనిషే కాదు. తనుశ్రీ గురించి కూడా నాకు తెలుసు. మరోసారి ఆమె తను చేస్తోన్న ఆరోపణలగురించి ఆలోచిస్తే మంచిది'' అని అన్నారు.    

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!