కోలీవుడ్ లో సుచి లీక్స్ అంటూ సెలబ్రిటీల బాగోతాలను బయటపెట్టింది సింగర్ సుచిత్ర. టాలీవుడ్ లో శ్రీలీక్స్ అంటూ శ్రీరెడ్డి కూడా కొందరి సెలబ్రిటీలను టార్గెట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఈ తరహా లీక్స్ మొదలుపెట్టబోతుంది నటి తనుశ్రీ దత్తా.

సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ చేసిన ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించడానికి రెడీ అవుతుంది. దానికి సంబంధించిన వీడియోని ఆమె మీడియా ముందు పెట్టబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఆ వీడియోలో తనతో నానా పటేకర్ అసభ్యకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఉన్నాయంటూ తనుశ్రీ దత్తా సన్నిహితులు చెబుతున్నారు. మేకింగ్ వీడియోలలోనే నానా పటేకర్ బాగోతమంతా రికార్డ్ అయిందని.. అయితే అప్పట్లో అతనికి ఉన్న స్టార్ డమ్ కారణంగా ఎవరి వద్దకు వెళ్లి వాటిని సాక్ష్యాలుగా చూపించినా పట్టించుకోలేదని ఇప్పుడు మాత్రం ఈ సమస్యను ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదని తనుశ్రీ తన సన్నిహితులకు చెబుతుండడం గమనార్హం.

ఓ పక్క ఇటువంటి ఆధారాలు సేకరిస్తూనే.. నానా పటేకర్ బాధితులతో ఆమె మాట్లాడి వారి వద్ద నుండి కూడా కొన్ని అసభ్యకర వీడియోలు ఉన్నాయని తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ వీడియోలలో ఏముందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!