తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజాలు తనుశ్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నటుడు శక్తికపూర్ స్పందించారు. ''నేను నిన్ననే విదేశాల నుండి వచ్చాను.

అక్కడ నిర్వహించే గణపతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లాను. నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. అయినా అది పదేళ్ల కిందటి విషయం.. అప్పుడు నేను చాలా చిన్నపిల్లాడ్ని'' అంటూ చమత్కరించారు. శక్తికపూర్ చేసిన వ్యాఖ్యలపై కొందరు బాలీవుడ్ తారలు మండి పడుతున్నారు. 

ఇలాంటి సీరియస్ ఇష్యూపై శక్తికపూర్ వెటకారంగా మాట్లాడడం ఏంటని..? అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2008 లో ఓ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల తప్పుగా ప్రవర్తించారని, అతడిని ఎదిరించినందుకు తనపైకి మనుషులను పంపించాడని తనుశ్రీ ఆరోపణలు చేసింది. తనుశ్రీ కారుపై కొందరు ఎటాక్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

సంబంధిత వార్తలు.. 

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!