బాలీవుడ్ లో పేరున్న నటుల్లో నానాపటేకర్ ఒకరు. హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లో నటించడమే కాకుండా.. నేషనల్ లెవెల్ లో అవార్డులను సైతం దక్కించుకున్న నానా పటేకర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, మహిళలను కొడతాడని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి తనుశ్రీ దత్తా.

2009లో 'హార్న్ ఒకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించింది. ''నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు.. కానీ అతడికి మహిళల పట్ల కనీసపు గౌరవం ఉండదు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. కానీ ఎవరూ మాట్లాడరు.

కనీసం అతడిని సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్ కూడా చేయరు. అక్షయ్ కుమార్, రజినీకాంత్ లాంటి పెద్ద పెద్ద హీరోలు నానాపటేకర్ లాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చినా ఫలితం ఉండదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు.. ''జనాలు ఈ విషయాల గురించి గుసగుసలాడుతారే తప్ప ధైర్యంగా బయటకి మాట్లాడలేరు. ఇలాంటి దారుణాలు చేసే వ్యక్తులను వదిలేసి మా గురించి తప్పుగా మాట్లాడతారు'' అంటూ బాధను వ్యక్తం చేసింది.    

సంబంధిత వార్త.. 
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!