మొన్నటివరకు తను శ్రీ దత్త - నానా పటేకర్ పేర్ల మీద అనేక కథనాలు బాలీవుడ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ తనుశ్రీ వర్సెస్ రాఖీ సావంత్ అన్నట్లుగా కొత్త తరహా వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తను శ్రీపై ఇటీవల రాఖీ 'ఆమె చెప్పేది అంతా అబద్దమే' అని కామెంట్స్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

దీంతో తను శ్రీ 10 కోట్ల పరువునష్టం దావా వేయగా అందుకు రాఖీ సావంత్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. నన్ను లో క్లాస్ గర్ల్ అంటావా? చూడు నేను 50కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ పరోక్షంగా హెచ్చరిక జారీ చేశారు. దీంతో మరోసారి ఈ వివాదం మరింత కాంట్రవర్షియల్ గా మారింది. 

తను శ్రీ చేసిన వ్యాఖ్యలకు పలువురు మద్దతు పలుకగా మరికొందరు నానా పటేకర్ కు మద్దతు ఇచ్చారు. ఇక మరికొందమంది మనకెందుకొచ్చిన తలనొప్పి అంటూ ఎక్కడైనా ఈ ప్రస్తావన వస్తే మెల్లగా నో కామెంట్స్ అంటూ జారుకుంటున్నారు.