బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అతడికి మహిళల పట్ల గౌరవం ఉండదని.. మహిళలను కొట్టి లైంగికంగా వేధిస్తుంటాడని సంచలన ఆరోపణలు చేసింది నటి తనుశ్రీ దత్తా.

పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానాపటేకర్ ఓ పాటలో ఇంటిమేటేడ్ సీన్స్ పెట్టాలని డిమాండ్ చేశాడని, అటువంటి సన్నివేశాలలో తను నటించడానికి నిరాకరించిందని కొందరు రౌడీలను షూటింగ్ స్పాట్ కి రప్పించి ఆమెపై ఎటాక్ చేయించారని.. ఆ సమయంలో రాజకీయాల సపోర్ట్ తో అతడు అలా చేశాడని, దానికి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా సహకరించారని చెప్పుకొచ్చింది తనుశ్రీ.

ఈ వార్తలపై స్పందించిన ఆచార్య గణేష్ ఆ మాటల్లో నిజం లేదని అంటున్నారు. ''ఇది పదేళ్ల క్రితం విషయం. అందువల్ల నాకు ఆ సినిమాలో పాట గుర్తు లేదు. తనుశ్రీ చెప్పినట్లుగా షూటింగ్ స్పాట్ లో ఆమెపై ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు. ఆమె తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి ఆ సమయంలో షూటింగ్ లో ఏదో గొడవ జరిగింది.

మూడు గంటల పాటు షూటింగ్ నిలిచిపోయింది. అలానే ఆ పాటలో ఎలాంటి అసభ్యకర దృశ్యాలు లేవు. అది పూర్తిగా డాన్స్ తో కూడుకున్న పాట. తనుశ్రీ ఆరోపిస్తున్నట్లు.. నానా ఎప్పుడూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్త.. 
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!