తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర' సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

ఒకప్పుడు తన హాట్ గ్లామర్ షోతో పేరు తెచ్చుకున్న ఈ భామ చాలా లావుగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ క్రమంలో తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను, లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో లాంగిక వేధింపులు నిజమేనని వెల్లడించింది. తను కూడా వాటి బాధితురాలినేనని కొన్ని వ్యాఖ్యలు చేసింది. 2008లో ఓ సినిమా షూటింగ్ లో తన సహనటుడు చాలా ఇబ్బంది పెట్టాడని, డాన్స్ భంగిమల గురించి వివరిస్తానని చెప్పి తనతో తప్పుగా ప్రవర్తించాడని తనుశ్రీ వెల్లడించింది.

సదరు నటుడి పేరుని మాత్రం చెప్పలేదు. తను మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్స్ చేసింది. అయితే ఈ సమాజం కారణంగా వారు ఇలాంటి వేధింపుల గురించి బయటకి చెప్పలేకపోతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది!