Asianet News TeluguAsianet News Telugu

చివరకు సారీ చెప్పిన ఒక్కడొచ్చాడు దర్శకుడు సురాజ్

  • తన వ్యాఖ్యలపై సారీ చెప్పిన తమిళ దర్శకుడు సురాజ్
  • తమన్నా ఆగ్రహం వ్యక్తం చేయడంతోె ముదిరిన వివాదం
  • సురాజ్ పై విరుచుకు పడ్డ దక్షిణాది సినీ తారమ్మలు
suraj say sorry to tamannah

‘‘కథానాయికలు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని వాళ్లు ఒంటి నిండా బట్టలు వేసుకోవడానికి వీల్లేదు’’ అని పబ్లిగ్గా స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తమిళ దర్శకుడు సురాజ్‌ చివరకు సారీతో ఈ అంశానికి ముగింపు పలికాడు. తమన్నా, నయనతార లాంటి హీరోయిన్లు అందరూ ఈ దర్శకుడిపై విరుచుకు పడటం, ‘అమ్మాయిలంటే, అంత అలుసా?’ అని విశాల్‌ సహా హీరోలు కూడా గొంతు కలపటంతో తో సారు దిగిరాక తప్పలేదు.

 

విశాల్, తమన్నా జంటగా సురాజ్‌∙దర్శకత్వం వహించిన ‘ఒక్కడొచ్చాడు’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో తమన్నా గ్లామరస్‌గా కనిపించారు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సురాజ్‌ను తమన్నా గ్లామర్‌ గురించి ఓ విలేకరి ఓ ప్రశ్నించగా... ‘కోట్ల కొద్దీ పారితోషికం తీసుకుంటున్నది అలా నటించడానికేగా?’ అని నోరు పారేసుకున్నారు.

అంతటితో ఆగక ‘‘లోయర్‌ క్లాస్‌ ఆడియన్స్‌ని కథానాయికలు చిట్టి పొట్టి బట్టలు వేసుకుని, ఆనందపరచాలి. ఒకవేళ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కనక కథానాయికలు వేసుకోవాల్సిన డ్రెస్సులను మోకాళ్లు కవర్‌ చేసేలా డిజైన్‌ చేస్తే... ‘లెంగ్త్‌ తగ్గించండి’ అని నిర్మొహమాటంగా చెబుతా అని సురాజ్ చెప్పుకొచ్చాడు. హీరోయిన్‌కి అసౌకర్యంగా అనిపించినా నాకు సంబంధం లేదు. ఆ డ్రెస్‌ వేసుకోవాల్సిందేనని చెప్పేస్తా’’ అని కూడా సురాజ్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి, ‘ప్రేక్షకులు అసలు థియేటర్‌కి వచ్చేదే కథానాయికలను ‘అలా’ చూడ్డానికే’ అని స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రేక్షకులు డబ్బులు పెట్టి టికెట్‌ కొనేది హీరోయిన్లను అలాంటి దుస్తుల్లో చూడ్డానికే’’ అని సురాజ్‌ అనడం చర్చనీయాంశమైంది.

 

సురాజ్‌ ఆ రోజున అసలు ఏ మూడ్‌లో ఉన్నారో, ఏమో కానీ, ‘ఒకవేళ కథానాయికలు తమ అందచందాల్ని కాకుండా, యాక్టింగ్‌ టాలెంట్‌ని మాత్రమే చూపించుకోవాలంటే టీవీ సీరియల్స్‌ లో చూపించుకోమనండి’ అని కూడా నోరేసుకొని పడ్డారు. ‘‘అసలు కమర్షియల్‌ సినిమాలు చేసే నాయికలకు పారితోషికం ఇచ్చేది... ప్రేక్షకులు పెట్టే టికెట్‌ డబ్బుకి తగ్గవి ఇవ్వడం కోసమే’’ అని కూడా సురాజ్‌ తనదైన భాష్యం చెప్పాడు.
 

గతంలో తమిళ దర్శకుడు తంగర్‌ బచ్చన్‌ అయితే గతంలో కథానాయికలను వేశ్యలతో పోల్చి, పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. ఆ సమయంలో సీనియర్‌ నటి ఖుష్బూ ఆ దర్శకుడిపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టి మరీ, చివరకు విజయం సాధించారు.

ఇప్పుడు అదే తరహాలో డైరెక్టర్‌ సురాజ్‌ మాటలతో హీరోయిన్‌ తమన్నా  ఘాటుగా స్పందించింది. ఆయన మాటల్ని తీవ్రంగా ఖండించింది. మరో స్టార్‌ హీరోయిన్‌ నయనతార నుంచి కూడా గట్టి స్పందనే వచ్చింది

శ్రుతీహాసన్, తదితర హీరోయిన్లు పలువురు కూడా వీరి మాటలకు సంఘీభావం ప్రకటిస్తూ, ట్విట్టర్‌లో ట్వీట్‌లు, రీ–ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది చిత్ర సీమలో సురాజ్‌ మాటలు, అతనిపై విమర్శలే... పెద్ద హాట్‌ టాపిక్‌. చివరకు సురాజ్‌ వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios