- Home
- Entertainment
- Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Anil Ravipudi: స్టార్ డైరెక్టర్ ఇంట్లో అంట్లు తోముతాడా? అనిల్ రావిపూడి గురించి ఆయన తండ్రి సంచలన కామెంట్స్
Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంటి పనులు చేస్తాడా? అంట్లు తోముతాడా? ఇంతకీ ఆయన తండ్రి చెప్పిన టాప్ సీక్రెట్ ఏంటి?

టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా వెలుగువెలుగుతున్నారు అనిల్ రావిపూడి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్, తన మార్క్ కామెడీ, టైమింగ్, కడుపుబ్బ నవ్వించే సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఓటమి ఎరుగని దర్శకుడిగా ఆయనకు పేరుంది. బుల్లితెరపై చిన్నపిల్లల రియాలిటీ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న ఆయనపై షోలోని పిల్లలు రకరకాల పంచ్‌లతో సరదాగా ఆటాడుకుంటున్నారు. రీసెంట్‌గా ప్రసారమైన 'డ్రామా జూనియర్స్' (Drama Juniors) షోలో ఆయన వ్యక్తిగత జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అనిల్ రావిపూడి ఇంట్లో అంట్లు తోముతాడా?
వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా వెలుగుతున్న అనిల్ నిజంగానే ఇంట్లో పనులు చేస్తారా? 'డ్రామా జూనియర్స్' షోలో ఓ చిన్నారి స్కిట్ చేస్తూ.. "నువ్వు అంట్లు తోమితే తళతళ మెరిసిపోతాయి" అని కామెంట్ చేసింది. దాంతో "ఎవరు.. నేనా?" అని స్టార్ డైరెక్టర్ షాక్ అయ్యారు. "అవును.. నువ్వే" అని ఆ పాప మరో షాక్ ఇచ్చింది. ఈ షోకి అనిల్ రావిపూడి తండ్రి శ్రీనివాసరావు గారు కూడా గెస్ట్‌గా వచ్చారు. ఆ పిల్లలు వేసిన పంచ్‌లు చూసి ఆయన ఎంతగానో ఎంజాయ్ చేశారు. స్కిట్ తర్వాత అనిల్ తండ్రికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది.
అనిల్ రావిపూడిపై ఆయన తండ్రి కామెంట్స్ వైరల్
అనిల్ రావిపూడి తండ్రి శ్రీనివాసరావు ఈ షో వేదికపైకి వచ్చి తన కుమారుడి గురించి మాట్లాడారు. "అనిల్ రావిపూడి ఇంట్లో పనులు చేస్తాడా?" అని యాంకర్ సుడిగాలి సుధీర్ ప్రశ్నించగా, దానికి ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అనిల్ ఇంట్లో అలాంటి పనులు ఏమీ చేయడట. "భోజనానికి కూర్చునే ముందు పొరపాటున మంచి నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయి అడిగితే.. తినే ముందు నీళ్లు తెచ్చుకోవాలని గుర్తుండదా?" అని రివర్స్‌లో అడుగుతాడని చెప్పి వేదికపై నవ్వులు పూయించారు. అలాగే తన కొడుకు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
చిన్న పిల్లలతో 'తమ్ముడు' అని పిలిపించుకున్న అనిల్
'డ్రామా జూనియర్స్' షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి, షోలోని చిన్నపిల్లలతో 'తమ్ముడు' అని పిలిపించుకోవడం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఒక చిన్నారిని 'అక్కా' అని పిలిచి, తనను 'తమ్ముడు' అని పిలవమన్నాడు. ఆ తర్వాత "తమ్ముడు అని పిలిచి నన్నే వెన్నుపోటు పొడుస్తావా?" అని ఆ చిన్నారితో అనిల్ చెప్పిన డైలాగ్స్ షోలో హైలైట్‌గా నిలిచాయి. "ఈ వయసులో కూడా తమ్ముడు అని పిలిపించుకుని మీరేం సాధిద్దామనుకుంటున్నారు?" అని సుడిగాలి సుధీర్ కూడా అనిల్‌పై సరదా పంచ్ వేశాడు. ఎప్పుడూ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండే తన మనస్తత్వం కారణంగానే అనిల్ రావిపూడి పిల్లలతో అంత సరదాగా మెలుగుతుంటారు.

