Asianet News TeluguAsianet News Telugu

సుచీలీక్స్ సుచీ మళ్లీ సునామీ సృష్టిస్తోంది... ఈసారి టార్గెట్ ఆమేనా?

  • మళ్లీ తెరపైకి సుచీలీక్స్ వ్యవహారం
  • ఈసారి మరిన్ని విషయాలతో నేను మళ్లీ వచ్చానంటున్న సుచీ
  • సుచీ ట్వీట్ తో బెంబేలెత్తిపోతున్న సౌత్ ఫిల్మ్ స్టార్స్
suchi leaks suchi tweet giving tension south stars again

గతేడాది దక్షిణాది సినీ తారల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వ్యవహారం సుచీ లీక్స్. అయితే గత కొన్ని నెలలుగా సుచీ తెరమరుగవటంతో ఆ నటీనటులంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ 'ఐయామ్ బ్యాక్' అంటూ సుచీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు వాళ్ల గుండెలు అదిరిపడేలా చేస్తోంది. సుచీ మళ్లీ ఏం లీక్ చేసి ఎవరి కొంప ముంచుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది.

'ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురు నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి' అని పేర్కొంటూ మరోసారి సుచిత్ర బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

సుచిత్ర తాజా ట్వీట్ కోలీవుడ్ స్టార్స్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. సుచిత్ర చేతిలో ఎవరు బలికాబోతున్నారు? అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. హీరో-హీరోయిన్ల ఎఫైర్స్ వీడియోలను సుచీ లీక్ చేస్తానని చెప్పడం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేదిగా మారింది.

 

గతేడాది సుచీ లీక్స్ బయటకొచ్చిన సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న ప్రచారం కూడా జరిగింది. నిజంగా సుచిత్రకు అసలేమైంది?.. ఆమె ఎందుకలా చేస్తుంది? అన్న దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం హీరో ధనుష్‌తో తలెత్తిన గొడవల కారణంగానే సుచిత్ర.. ఈ 'లీక్స్'తో బ్లాక్ మెయిల్ చేస్తోందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకనే వారిపై ఇంతలా కక్ష కట్టిందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

సుచీ లీక్స్ లో భాగంగా ధనుష్ అన్న సెల్వరాఘవన్ ఓ హీరోయిన్ తో న్యూడ్ సినిమా చేశాడన్న విషయం అప్పట్లో లీకైంది. దీనికి సంబంధించి సదరు హీరోయిన్ నుంచి సెల్వ భార్యకు కూడా మెయిల్స్ వెళ్లాయని, ఆ సినిమా విడుదలవకుండా చూడాలని ఆమె ప్రాధేయపడినట్లుగా ప్రచారం జరిగింది.

అప్పట్లో నాగచైతన్యతో పెళ్లి వైపుగా అడుగులు వేస్తున్న వేళ.. సమంతను కూడా సుచీ లీక్స్ వ్యవహారం బెంబేలెత్తించింది. సుచిత్ర సమంత వీడియోలను కూడా లీక్ చేయబోతుందన్న ప్రచారం ఊపందుకోవడంతో.. తదుపరి టార్గెట్ ఆమెనే అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అనుకున్నట్లుగా సమంత వీడియోలేమి సుచిత్ర లీక్ చేయలేదు. సుచీ లీక్స్ లో భాగంగా ధనుష్, అనిరుధ్, చిన్మయి, త్రిష, నయనతార, ఆండ్రియా తదితర స్టార్స్ ఎఫైర్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. కొంతమంది స్టార్స్ ఈ వ్యవహారాన్ని కొట్టిపారేశారు.

 

ఇదే విషయంపై అప్పట్లో స్పందించిన అమలాపాల్ మాత్రం కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. 'నేను కూడా నా పేరుతో విడుదలయ్యే వీడియోని చూడాలని చాలా ఎదురు చూశాను. కానీ ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయిపొయింది. చాలా బాధాకరం' అని అమలాపాల్ అప్పట్లో పేర్కొన్నారు.

 

తన భార్య మానసిక పరిస్థితి బాగా లేకనే ఇలా చేస్తోందని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని అప్పట్లో సుచిత్ర భర్త తెలిపారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ ఖాతా కూడా క్లోజ్ అయిపోయింది. దీంతో ఈ వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు.

 

అనూహ్యంగా ఇప్పుడు 'నేను మళ్లీ వచ్చేశాను..' అని సుచిత్ర బాంబు పేల్చడంతో కోలీవుడ్ స్టార్స్‌కు మళ్లీ భయం పట్టుకుందట. ఇంతకీ సుచిత్ర ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతుందో మరి?

Follow Us:
Download App:
  • android
  • ios