Asianet News TeluguAsianet News Telugu

రకుల్ నిన్ను షూటింగ్ స్పాట్ కు వచ్చి కొడతా ఏం అనుకుంటున్నావ్ : శ్రీరెడ్డి

కుల్ ప్రీత్ సింగ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. ఆమె మాటలు యథాతథంగా... ఉత్తర భారతానికి చెందిన ఒక రెక్క పీత గురించి చెబుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంట‌ెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది అని శ్రీరెడ్డి చెప్పింది.
Sri reddy counter to rakul comments

గత కొన్నిరోజులుగా శ్రీరెడ్డి చేస్తున్న హాంగామా అందరికి తెలిసిందే. తాజాగా పిలింనగర్ లో అర్ధనగ్నంగా నిలబడిన సంగతి తెలిసిందే. దానితో శ్రీరెడ్డి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.తెలుగు యాక్టర్స్ కు అన్యాయం జరిగిందంటు పోరటం చేస్తున్న శ్రీ రెడ్డి రకుల్ కు గట్టి వార్నింగ్ లే ఇచ్చింది.  శ్రీరెడ్డి మాటలకు రకుల్ స్పందిస్తూ..మాధవీలత, శ్రీరెడ్డి  ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి నాకు తెలీదు. వారిని ఏ సినిమాలో కూడా చూడలేదు. అయినా వారంటే నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నా అనుభవాల గురించే మాత్రమే నేను మాట్లాడాను. టాలీవుడ్‌లో నేను చాలా సురక్షితంగా ఉన్నాను అని రకుల్ అన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. ఆమె మాటలు యథాతథంగా... ఉత్తర భారతానికి చెందిన ఒక రెక్క పీత గురించి చెబుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంట‌ెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది అని శ్రీరెడ్డి చెప్పింది.

ఏమే.. నువ్వూ నీ గెడకర్ర మొఖం. చుంచులు పీకేసిన తాటి ముంజ మొఖమొకటేసుకుని, నువ్వు మా ఊళ్లో పిల్లలాడుకునే సైకిల్ టైర్‌లా ఉంటావే. ఒక ఆడదానివని వదిలేస్తున్నాను.. అందుకే తక్కువ మాట్లాడుతున్నాను. అసలు నీకెందుకే మా తెలుగోళ్ల గురించి, మా ఉద్యమాల గురించి అని తీవ్రంగా స్పందించారు.

ఇక్కడకొచ్చి ఏలేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావే నువ్వు. నీకు టాలెంట్ ఉందా.. నీకు లిప్ మూమెంట్ వచ్చా అసలు. అసలు నీ మొఖానికి లంగాఓణీ వేసుకుంటే ఎలా ఉంటావో చూసుకున్నావా. అసలు మా పోరాటాల గురించి నీకెందుకే. వాళ్లు సక్సెసా? ఫెయిల్యూరా? అనేది నీకేందుకు. నోరు మూసుకుని కూర్చో ఇంట్లో. తెలుగు హీరోయిన్లకు కోపం వస్తే నీ షూటింగ్ స్పాట్‌కొచ్చి మరీ కొడతాం అని రకుల్ పరోక్షంగా శ్రీరెడ్డి హెచ్చరించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios