Asianet News TeluguAsianet News Telugu

వర్మతో షకీలానా... జీఎస్టీ లాంటి మూవీలో..ఇంకేమైనా వుందా..?

  • నైంటీస్ లో దక్షిణాది కుర్రకారుకు శృంగార దేవతగా షకీలా
  • సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలనే వణికించిన షకీలా
  • తాజాగా శీలవతి అనే చిత్రంతో గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్న షకీలా
  • ఈ సందర్భంగా వర్మ జీఎస్టీపై స్పందించిన షకీలా
soft porn star shakeela ready to work wtih ramgopal varma for gst

గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తో, టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడంటే సన్నీ లియోనీ, మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్స్ ఇప్పుడు అరచేతిలోకి వచ్చారు గానీ.. అప్పట్లో శృంగార తార అంటే కేవలం 'షకీలా'నే. తొంభైయవ దశకంలో ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్న పరిస్థితి. అలా హవా కొనసాగించిన షకీలా రీసెంట్ టైమ్స్ లో కొన్ని కేరక్టర్స్ వేసింది తప్ప పెద్దగా కనిపించింది లేదు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు 'శీలవతి' టైటిల్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

 

గతంలోనే సినిమాలతో విసిగిపోయానని, పెళ్లి చేసుకుని సెటిల్ అవాలనుందని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది షకీలా. కానీ మళ్లీ 'శీలవతి' అనే బోల్డ్ టైటిల్ తో మళ్లీ రెచ్చిపోవడానికి సిద్దమైంది. షకీలా లాంటి అదోరకం ఇమేజ్ వున్న స్టార్‌ చిత్రానికి 'శీలవతి' అనే టైటిల్ పెట్టడంపై సోషల్ మీడియాలో  తెగ చర్చ జరుగుతోంది.

 

ఇక 'శీలవతి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా షకీలాకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సౌత్ ఇండియాలో మీరో పాపులర్ శృంగార తార కదా.. 'జీఎస్‌టీ-2'లో వర్మ మీకు ఛాన్స్ ఇస్తే చేస్తారా? అని ప్రశ్నించాడు. ఇందుకు షకీలా కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.

 

'వర్మ ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం. వర్మ లాంటి దర్శకుడు అడిగితే వద్దంటానా?.. చేయడానికి నేను రెడీ. ఆయన కెమెరా యాంగిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయనలాగా అందాల్ని మరెవరూ చూపించలేరు. కానీ.. ఆయనకేమో సన్నగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం.' అని షకీలా బదులిచ్చింది. 'ఒకవేళ వర్మ నాకు ఛాన్స్ ఇచ్చినా.. ఆయన సినిమా కోసం ఇప్పటికిప్పుడు 30కిలోలు తగ్గమంటే అది అయ్యే పనికాదు.. నావల్ల కాదు' అంటూ షకీలా సరదాగా చెప్పుకొచ్చింది.

 

'జీఎస్‌టీ' పైన వస్తున్న విమర్శలపై స్పందించాలని కోరగా.. 'మహిళా సంఘాల వాళ్లు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటారు. నా సినిమాలకు కూడా వీళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసేవాళ్లు. మీకు ఇష్టముంటే సినిమా చూడండి. లేకపోతే లేదు. రచ్చ ఎందుకు' అంటూ స్పందించింది. నిజానికి షకీలా అనుకోని పరిస్థితుల్లో సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లోకి వచ్చిందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఆమె బాల్యంలో ఎదురైన కొన్ని పరిస్థితులే ఆమెను ఇటువైపు నడిపించాయి. అయితే 2003నుంచి ఆమె సాఫ్ట్ పోర్న్ సినిమాలు మానేసి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా కొన్ని సినిమాలు చేసింది.

 

తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు 'యూ టర్న్' తీసుకుని జీ స్టూడియోస్‌ పతాకంపై షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో 'శీలవతి' సినిమా మొదలైంది. ఈ సినిమాకు WHAT THE F*** అనే ట్యాగ్ లైన్ పెట్టడం గమనార్హం. రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరూ బాసింశెట్టిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఈ ఫిల్మ్ మేకర్స్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios