హరర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కన్నడ సూపర్ హిట్ మూవీ `యు టర్న్` సినిమాతో అందరి దృస్టిని ఆకర్షించిన బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. తరువాత తెలుగులో జెర్సీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే నటిగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. తాజాగా కృష్ణ అండ్‌ హిజ్‌ లీల అనే బోల్డ్ సినిమాలో నటించి అందరికీ షాక్‌ ఇచ్చింది ఈ బ్యూటీ. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది శ్రద్ధా శ్రీనాథ్‌. హాట్ హాట్‌ ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ తీయించుకున్న ఓ ఫోటో షూట్‌ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. గతంలోనూ క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ ఫోటో షూట్‌లు చేసినా.. తాజా ఫోటో షూట్‌ మరో రేంజ్‌లో ఉందంటున్నారు అభిమానులు.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ, కన్నడ సినిమాల్లో 5 సినిమాల్లో నటిస్తోంది. సాండల్‌వుడ్‌లో గోద్రా, కోలీవుడ్‌ లో చక్ర సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. పాంటమ్‌, రుద్ర ప్రయాగ, మార సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాల షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.