కరోనా కారణంగా దాదాపు 75 రోజులుగా అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లుగా ఇంట్లోనే ఉన్న సెలబ్రిటీలు కూడా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని సీరియల్స్‌, సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు కూడా మొదలైపోయాయి. దీంతో తారలు తళఖులతో ముంబై నరగం గ్లామర్ సంతరించుకుంటుంది.

ఇప్పటికే మల్లికా శెరావత్‌, శక్తి కపూర్‌ లాంటి వారు వీదుల్లో కనిపిస్తుండగా మరికొందరు సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ దర్శనమిస్తున్నారు. షాపింగ్‌లు, రెస్టారెంట్లు అంటూ తెగ సందడి చేస్తున్నారు తారలు. తాజాగా షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ లో పాల్గొన్న తను దర్శకుడిని హగ్ చేసుకోలేకపోయానన్నాడు.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర దృశ్యం బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ల కెమెరా కంటపడింది. హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. ముంబైలోని బాంద్రాలో ప్రియుడు రోహన్‌ శ్రేష్టతో కలిసి స్కూటీ మీద వెళుతున్న శ్రద్దా కపూర్‌ను గుర్తుపట్టి కొంత మంది జర్నలిస్ట్‌లు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జిమ్‌ డ్రెస్‌లో, ముఖానికి మాస్క్ ధరించి రోహన్ బైక్‌ డ్రైవ్ చేస్తుండగా వెనుక కూర్చొంది శ్రద్ధా కపూర్‌. గత రెండేళ్లుగా శ్రద్ధా, రోహన్‌లు డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ బ్యూటీ ఇప్పట్లో షూటింగ్‌లకు హజరు కానని తేల్చి చెప్పేసింది.