MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • మానసికంగా అలసిపోయా, నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి కావాలి.. షాకిస్తున్న ఇలియానా ఎమోషనల్ కామెంట్స్

మానసికంగా అలసిపోయా, నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి కావాలి.. షాకిస్తున్న ఇలియానా ఎమోషనల్ కామెంట్స్

ప్రస్తుతం కొడుకు, భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 25 2024, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సునామి సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలసి ఆడిపాడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అయితే కెరీర్ బాగానే సాగుతున్న టైంలో బాలీవుడ్ లో వెళ్లి రాణించాలని భావించడం ఇలియానా చేసిన తప్పు. ఫలితంగా ఇలియానా కెరీర్ డౌన్ ఫాల్ అయింది. ఆమెకంటే ముందు వచ్చిన త్రిష, శ్రీయ లాంటి హీరోయిన్లు ఇప్పటికీ రాణిస్తున్నారు. కానీ ఇలియానా టాలీవుడ్ ని వదిలి వెళ్లడంతో ఆమెని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు. 

38

ఇలియానా లవ్ ఎఫైర్స్ కు సంచలనం సృష్టించాయి. బ్రేకప్ ల వల్ల ఆమె మానసికంగా కుంగిపోయిన సంగతి తెలిసిందే. గతంలో ఇలియానా ఓ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ని ప్రేమించింది. వాళ్ళిద్దరి ప్రేమ బ్రేకప్ కావడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళింది. డిప్రెషన్ నుంచి తిరిగి కోలుకున్న ఇలియానా మరో వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి కూడా అయింది. 

48

ప్రస్తుతం కొడుకు, భర్తతో హ్యాపీగా ఉన్న సమయంలో ఇలియానా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలియానా అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఇలియానా నటించిన లేటెస్ట్ మూవీ దో ఔర్ దో ప్యార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

58

ఈ చిత్రంలో ఇలియానా నోరా అనే పాత్రలో నటించింది. ఈ పాత్ర తన రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుందట. నోరా లాగే నేను కూడా చాలా సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది. నన్ను ఘాడంగా ప్రేమించే వ్యక్తి ఉండాలని చాలా సార్లు కోరుకున్నా. నన్ను ప్రేమించే వ్యక్తిని పబ్లిక్ గా హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం, బాగా నమ్మడం లాంటివి పబ్లిక్ లో చేయడానికి నేను వెనుకాడను అని ఇలియానా తెలిపింది. 

68

ఈ చిత్ర దర్శకురాలు శిరీష కథ చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నా. ఎందుకంటే ఈ పాత్ర నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది. కాస్త నా పాత్రలో నెగిటివ్ కోణం ఉండడంతో నేను ఇంత తొందరగా ఒప్పుకుంటానని దర్శకురాలి శిరీష అనుకోలేదు. 

78

ఈ పాత్ర కోసం శారీరకంగా జిమ్ వర్కౌట్స్ లాంటివి చేయాలని దర్శకురాలు అడుగుతుందేమో అని భయపడ్డా. ఎందుకంటే నేను ఇప్పుడు మానసికంగా అలసిపోయి ఉన్నాను. కాబట్టి వర్కౌట్స్ చేసి నా బాడీని మార్చుకునే ఓపిక నాకు లేదు. బరువు తగ్గడం నా వల్ల కాదు అని శిరీషకి చెప్పేశా. ఆమె స్టుపిడ్ లాగా మాట్లాడకు.. ఇప్పుడు నిన్ను బరువు తగ్గమని ఎవరు చెప్పారు.. నువ్వు ఎలా ఉన్నావో అలాగే కంటిన్యూ అవ్వు అని తనకి ధైర్యం చెప్పినట్లు ఇలియానా గుర్తు చేసుకుంది. 

88

అయితే భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్న ఇలియానా ఎందుకు మానసికంగా అలసిపోయాను అంటూ స్టేట్మెంట్స్ ఇస్తోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంత సమస్య ఇలియానాకి ఏమొచ్చిందనే డౌట్స్ మొదలయ్యాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved