మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. రిలీజ్ కి ముందే ఈ చిత్రం పట్ల మెగా అభిమానులు అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. రిలీజ్ కి ముందే ఈ చిత్రం పట్ల మెగా అభిమానులు అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది. ఇంతవరకు సినిమాపై అంచనాలు పెంచేలా ఒక్క టీజర్ కూడా రిలీజ్ కాలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల విడుదలైన సాంగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం శంకర్, రాంచరణ్ క్రేజ్ పైనే ఏమైనా జరిగితే అద్భుతాలు జరగాలి అని ఫ్యాన్స్ అంటున్నారు. షూటింగ్ నత్తనడకగా సాగుతుండడం.. ఇంతవరకు రిలీజ్ డేట్ కూడా ఖరారు కాకపోవడం ఫ్యాన్స్ కి చిరాకు పుట్టించే అంశాలు. 

శంకర్ ఇటీవల తన కుమార్తె ఐశ్వర్య శంకర్ పెళ్లి కారణంగా కాస్త బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె పెళ్లి పూర్తయింది. దీనితో శంకర్ తిరిగొచ్చి గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎయిర్ పోర్ట్ నేపథ్యంలో రాంచరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్.. బుచ్చిబాబు, సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.