MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా? 

కేటీఆర్ కంటే లోకేష్ బాగా రిచ్ ... ఎవరి ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా? 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, తెలంగాాణలో బిఆర్ఎస్ అధికారంలో వచ్చాయి. అక్కడ చంద్రబాబు సీఎం, లోకేష్ మంత్రి కాగా ఇక్కడ కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం మాజీ సీఎంల తనయులు, కాబోయే ముఖ్యమంత్రులుగా ప్రచారంలో వున్న లోకేష్, కేటీఆర్ ఆస్తిపాస్తులను పోలిస్తే...     

3 Min read
Arun Kumar P
Published : Apr 25 2024, 08:56 AM IST| Updated : Apr 25 2024, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Chandrababu Naidu

Chandrababu Naidu

ఆంధ్ర  ప్రదేశ్ లో ఎలక్షన్ హడావిడి సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇలా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా నామినేషన్లు వేసారు. ఈ క్రమంలో వారి ఆస్తిపాస్తుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి ఆదాయం, ఆస్తులు, అప్పుల వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.  

211
KCR KTR

KCR KTR

ఇదే క్రమంలో పొరుగున వున్న మరో తెలుగు రాష్ట్రం  తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సమయంలో మాజీ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలు కూడా బయటకు వచ్చాయి.  అయితే ఏపీలో చంద్రబాబు, లోకేష్ లాగే తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి, ఐటీ మంత్రిగా పనిచేసారు. కాబట్టి ప్రధాన పార్టీల అధినేతలు, మాజీ ముఖ్యమంత్రుల తనయులైన కేటీఆర్-లోకేష్ ల ఆస్తిపాస్తులు, ఆదాయం, అప్పులు ఎలా వున్నాయో పోల్చి చూద్దాం

311
Nara Lokesh

Nara Lokesh

నారా లోకేష్ : 

ముందుగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మళ్లీ ఆయన మంగళగిరి అసెంబ్లీలోనే పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఆయన నామినేషన్ కూడా దాఖలుచేసారు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తిపాస్తులను పేర్కొన్నారు. అలాగే భార్య బ్రాహ్మణి పేరిట వున్న ఆస్తుల వివరాలను కూడా లోకేష్ వెల్లడించారు. 

411
nara lokesh

nara lokesh

లోకేష్ తో పాటు భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.523 కోట్లుగా ప్రకటించారు.  లోకేష్ ఆదాయం రూ.1,41,64,363 గా వుంది. ఆయన పేరిట వున్న స్థిరాస్తుల విలువ రూ.92,31,09,546 కాగా చరాస్తుల విలువ రూ.341,68,22,459 గా వుంది. ఇక లోకేష్ అప్పుల విషయానికి వస్తే రూ.3,48,81,937 కోట్టుగా పేర్కొన్నాడు. 

511
Nara Brahmani

Nara Brahmani

ఇక లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆదాయం భర్త కంటే ఎక్కువగా రూ.7,57,04,812 కోట్లుగా వుంది. స్థిరాస్తులు రూ.35,59,21,125 కోట్లు కాగా చరాస్తులు రూ.45,06,30,277 కోట్లుగా వున్నాయి. ఆమె అప్పులు రూ.14,34,37,042 కోట్లుగా వున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే బ్రాహ్మణి తన తల్లి వసుంధర నుండి రూ.42 లక్షలు, తండ్రి బాలకృష్ణ నుండి రూ.16 లక్షలు,  అత్త భువనేశ్వరి నుండి 10 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

611
Brahmani

Brahmani

ఇవి కాకుండా బ్రాహ్మణి వద్ద రూ.2500 గ్రాముల బంగారం  (కోటి రూపాయల విలువు), మరో కోటిన్నర రూపాయల విలువైన డైమండ్స్, రత్నాలతో కూడిన ఆభరణాలు వున్నాయి. కొడుకు దేవాన్ష్ తో కలిపి హైదరాబాద్ లోని ఓ వాణిజ్య భవనంలో 50 శాతం వాటాను బ్రాహ్మణి కలిగివున్నారు. 

711
Nara Lokesh

Nara Lokesh

ఇలా నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్ లో షేర్లు వున్నాయి.  బ్రాహ్మణి పేరిట మాదాపూర్ కొంత భూమి, రంగారెడ్డి వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం వుంది.  

811
KCR, KTR

KCR, KTR

కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) : 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి. ఆయన హయాంలోనే హైదరాబాద్ లో ఐటీ బాగా అభివృద్ది చెందిందని ... అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఓడినా హైదరాబాద్ లో మాత్రం బిఆర్ఎస్ గెలిచిందని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కేటీఆర్ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సిరిసిల్ల నుండే పోటీచేసి గెలిచారు.

911
KTR

KTR

అయితే నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కేటీఆర్ ఆస్తిపాస్తుల వివరాలిలా ఉన్నాయి. కేటీఆర్-శైలిమ దంపతుల పేరిట వున్న ఆస్తుల విలువు రూ.51 కోట్లు మాత్రమే.ఇందులోనూ శైలిమ పేరిట వున్న ఆస్తులే ఎక్కువ.  

1011
KTR

KTR

కేటీఆర్ పేరిట రూ.6.92 కోట్ల చరాస్తులు మాత్రమే వున్నాయి. కేటీఆర్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్లు, కొంత నగదు, టి న్యూస్ లో వాటా, బంగారం, వెండి విలువ ఇది.  ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే కేటీఆర్ పేరిట రూ.17.83 కోట్ల విలువైనవి వున్నాయి. కేటీఆర్ కు రూ.11.89 కోట్ల అప్పులు కూడా వున్నాయి. 

1111
KTR

KTR

ఇక శైలిమ చరాస్తుల విలువు భర్త కేటీఆర్ కంటే ఎక్కువగా వుంది. ఆమెకు రూ.26.49 కోట్ల విలువైన   చరాస్తులు వున్నాయి.  నగదు, డిపాజిట్లు, ఈటిజి గ్లోబల్ సర్వీసెస్ లో షేర్లు, ఎట్ హోం హాస్పిటాలిటీలో వాటాతో పాటు గోల్డ్ బాండ్లు వున్నారు. 

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ మ్యాప్ మారిపోతోంది ! తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
Recommended image2
హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Recommended image3
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. మూడు దశల్లో పోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved