ఒకప్పటి సమంత వేరు..ఇప్పుడు ఆచి,తూచి ప్రతీ విషయంలోనూ లెక్కలు వేసుకుని రంగంలోకి దిగే రంగస్దలం సమంత వేరు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, ఒంటి చేత్తో సినిమా మోయగలను అనిపించుకుంటోన్న ఈ అక్కినేని కోడలు అంటే దర్శక,నిర్మాతలు తెగ ఇష్టం. డేట్స్ దొరికితే యమా స్పీడుగా సినిమా పూర్తైపోతుంది. పనిలో పనిగా రిలీజ్ కు ఇబ్బంది ఉండదని నమ్మకం. దాంతో ఆమె చుట్టూ స్క్రిప్టులు పట్టుకుని తెగ తిరుగుతున్నారు. ఈ విషయం గమనించిన ఆమె కూడా రెమ్యునేషన్ తో ఓ రేంజిలో ట్విస్ట్ లు ఇస్తోందిట. రీసెంట్ గా అలాంటి కొర్రె ఒకటి ఓ బడా నిర్మాతకు పడిందిట.

ఆ నిర్మాత బ్యానర్ లో గతంలో సమంత నటించింది. దాంతో ఆయన ఆ పరిచయం పురస్కరించుకుని, ఆమెతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా లాగేద్దామని, లాభాలు పంట పండిద్దామని పెద్ద స్కెచ్ వేసారు. తన చేతిలో ఉన్న ఓ డైరక్టర్ చేత కథ అర్జెంట్ గా వండించి, ఆమెను ఎప్రోచ్ అయ్యారట. అయితే సమంత..కథ సమస్య ఏమి లేదు కానీ తనకు మూడున్నర కోట్లు రెమ్యునేషన్ ఇస్తే మారు మాట్లాడుకుండా షూటింగ్ పెట్టేసుకుందామని చెప్పిందిట. 

దాంతో ఆ నిర్మాత నోట మాట రాలేదట. అసలు ఇంత పెద్ద మొత్తం కలలో కూడా ఊహించలేదు. ఇంత ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చేలా ఉంటే ఓ హీరోతో ముందుకు వెళ్తాను కదా అని భోరున వాపోయారట. ఆ నిర్మాతను ప్రక్కన పెడటానికి సమంత ఈ రెమ్యునేషన్ పెంచిందా లేకా నిజంగానే ఆమె అంత వసూలు చేస్తోందా అనేది ఇప్పుడు మిగతా నిర్మాతలకు మిలియన్ డాలర్ల ప్రశ్న. 
 
సమంత తెలుగులో ‘జాను’ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా కమిటవ్వలేదు. అందుకు కారణం ఆ సినిమాపై ఆమె పెట్టుకున్న ఎక్సపెక్టేషన్స్ ...తల క్రిందులు అవటమే అంటున్నారు.  ఆమె నుంచి ఓ పెద్ద ఎనౌన్సమెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేఫధ్యంలో సమంత ఓ కొత్త సినిమా కమిటైందని, అదీ పెద్ద బ్యానర్ నుంచి అనే వార్త అభిమానులకు ఆనందం కలగచేస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తుందట. దానికోసం సమంతని ఒప్పించడానికి సోనీ పిక్చర్స్ రంగంలోకి దిగి ఒప్పించిదని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఆ చిత్రం ద్వారా పరచయం కానున్నాడు. ఈ సినిమాకు సంభందించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ లోగా లాక్ డౌన్ రావటంతో ప్రక్కన పెట్టి షూట్ కు వెయిట్ చేస్తున్నారట. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.  లాక్ డౌన్ ముగియగానే.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చెప్తున్నారు.  సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది వారి ప్లాన్‌గా చెబుతున్నారు.