నిర్మాతలకు సమంత కొత్త కండీషన్స్,ఓకే అంటేనే సైన్ చేస్తా

 రూమర్స్  కు తెరదించుతూ మేము విడిపోతున్నాం అని ప్రకటించేసింది టాలీవుడ్‌ జంట నాగచైతన్య- సమంత. ఈ నేపథ్యంలో సమంత ఏ పోస్టు చేసినా, ఏం మాట్లాడినా అది నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె నుంచి వచ్చే అప్‌డేట్స్‌ మీద చర్చలు జరుగుతున్నాయి. 

Samanthas Conditions To Producers about locations

 నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత కెరీర్‌ పరంగా స్పీడుగా ముందుకు వెళ్తోంది సమంత. ప్రస్తుతం గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లో నటిస్తోన్న ఆమె.. మరో రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పేసింది. దసరా సందర్భంగా ఆ చిత్ర  టీమ్ ల నుంచి అధికారిక ప్రకటనలు వెలుబడ్డాయి. అయితే ఆమె నిర్మాతలకు కొన్ని కొత్త కండీషన్స్ పెడుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆ కండీషన్స్ ఏమిటో చూద్దాం.

అందుతున్న సమాచారం ప్రకారం ..సమంత తాను చేయబోయే చిత్రాల షూటింగ్ లొకేషన్స్ చెన్నై, ఆ చుట్టు ప్రక్కల ఉండేలా చూడమంటోంది.  హైదరాబాద్ లో షూటింగ్ లకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఒక వేళ హైదరాబాద్ లో చేయటం తప్పనసరి అయితే ఇన్ డోర్స్ లో  పెట్టుకోమంటోంది. అవుట్ డోర్స్ కు వెళ్లే మూడ్ లో తాను లేనని చెప్తోంది.  వీటికి ఓకే అనుకుంటేనే ప్రాజెక్టు సైన్ చేస్తోంది.

Also read బిగువైన ఎద అందాలు మరింత దగ్గరగా... చోళీ లెహంగాలో కసిగా కవ్విస్తున్న హాట్ యాంకర్ వర్షిణి!

ప్రస్తుతం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న 30వ సినిమాలో సమంత నటించబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా వెల్లడిస్తూ సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 

Also read అసలు దీన్ని ఎలా... అంటూ రష్మికపై నెటిజెన్ దారుణమైన కామెంట్.. కూల్ రిప్లై తో షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ

అలాగే శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది. ఈ చిత్రానికి హరి, హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీరికి ఇదే తొలి సినిమా. నవంబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు చిత్ర టీమ్ వెల్లడించింది. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios