అసలు దీన్ని ఎలా... అంటూ రష్మికపై నెటిజెన్ దారుణమైన కామెంట్.. కూల్ రిప్లై తో షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ
సెలబ్రెటీలపై సోషల్ మీడియా ట్రోలింగ్ చాలా సాధారణం. ఎవరిని ఎవరైనా టార్గెట్ చేసి కామెంట్ చేసే వెసులుబాటు సోషల్ మీడియా కల్పించడంతో ఈ సమస్య అధికంగా ఉంది. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఈ టార్చర్ మరింత ఎక్కువగా ఉంటుంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన తరచుగా ట్రోల్ల్స్ కి గురవుతూ ఉంటారు. చాలా సార్లు సదరు ట్రోల్స్ కి తనదైన రీతిలో ఆమె స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజెన్ రష్మికను ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్ చేశాడు. 'అసలు దీన్ని ఎలా పెట్టుకుంటున్నార్రా... బాబు' అని రశ్మికను కించ పరిచే విధంగా కామెంట్ పెట్టాడు.
Rashmika mandanna అందమైన హీరోయిన్ కాదని, ఆమెకు పెద్ద పెద్ద స్టార్స్ పక్కన అవకాశాలు ఏమిటీ?... అనే అర్ధం వచ్చేలా ఆ నెటిజెన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి రష్మిక స్వయంగా రిప్లై ఇవ్వడంతో, ఈ మేటర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఆ నెగిటివ్ కామెంట్ కి జవాబుగా.. నా నటన కోసం నన్ను సినిమాలలోకి తీసుకుంటున్నారని ఆమె బదులిచ్చారు. నెటిజెన్ అమర్యాదపూర్వకంగా రశ్మికను సంబోధించినా.. ఆమె మాత్రం చాలా కూల్ గా సమాధానం చెప్పి, అందరి హృదయాలు కొల్లగొట్టారు.
కెరీర్ బిగినింగ్ లో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. నిశితార్థం కూడా జరిగాకా ఈ వివాహం ఆగిపోయింది. ఆ సమయంలో Rakshith shetty ఫ్యాన్స్ రష్మికను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే రక్షిత్ శెట్టి.. ఆమెను ఏ విధమైన సోషల్ మీడియా వేధింపులకు గురి చేయవద్దని, అభ్యర్ధించారు.
ఇక రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ఆఫర్స్ తో పరిశ్రమను దున్నేస్తున్నారు. హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేస్తున్నారు. ఇక తెలుగులో రష్మిక మరో రెండు చిత్రాలు చిత్రాలు చేస్తున్నారు. శర్వానంద్ కి జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో రష్మిక నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆమెతో పాటు సీనియర్ హీరోయిన్స్ రాధిక, ఊర్వశి వంటివారు నటిస్తున్నారు. రష్మిక నటిస్తున్న వాటిలో Pushpa క్రేజీ ప్రాజెక్ట్ గా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో allu arjun హీరోగా తెరకెక్కుతున్న పుష్ప, రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
Also read దీపికాని మోసం చేయడంపై రణబీర్ బోల్డ్ స్టేట్మెంట్.. ఆమెకు టెంప్ట్ అయ్యాను అంటూ..
Also read సమంత చైతూ విడాకులు...అతడు గే, విబేధాలకు కారణం అదే, అసలు సీక్రెట్స్ బయటపెట్టిన శ్రీరెడ్డి