Asianet News TeluguAsianet News Telugu

Pushpa: థ్రిల్లింగ్ అప్డేట్.. అల్లు అర్జున్ తో సమంత ఐటెం సాంగ్, 'జిగేల్ రాణి'ని మించేలా మాస్ స్టెప్పులు

పుష్ప చిత్ర ఐటెం సాంగ్ కోసం సమంత ఖరారైనట్లు తెలుస్తోంది. ఇది తప్పకుండా అభిమానులు థ్రిల్లింగ్ అప్డేట్. 

 

Samantha confirmed for Allu Arjun Pushpa movie item song
Author
Hyderabad, First Published Nov 14, 2021, 1:57 PM IST

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. పుష్ప చిత్ర యూనిట్ తెలియజేస్తున్న ప్రతి విశేషం ఫ్యాన్స్ ని థ్రిల్ కి గురిచేస్తోంది. డిసెంబర్ 17న పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 

తాజాగా Pushpa చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చేలా ఉంది. Sukumar చిత్రం అంటే ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుంది. అది కూడా సుక్కు, దేవిశ్రీ కలసి ఐటెం సాంగ్ ని స్పెషల్ గా ప్లాన్ చేస్తారు. థియేటర్స్ లో మాస్ జనాలు ఊగిపోయేలా సుకుమార్ చిత్రాల్లో ఐటెం సాంగ్ ఉంటుంది. 

పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ కోసం సుకుమార్ చాలా మంది హీరోయిన్లని పరిశీలిస్తూ వచ్చాడు. తాజా సమాచారం మేరకు స్టార్ హీరోయిన్ సమంత ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ అడగగానే Samantha స్పెషల్ సాంగ్ కోసం అంగీకరించిందట. మంచి మాస్ బీట్ తో ఈ ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రంగస్థలం చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. 

ఆ చిత్రంలో పూజా హెగ్డే చేసిన 'జిగేల్ రాణి' సాంగ్ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో  అందరికీ తెలిసిందే. రాంచరణ్ డాన్స్, పూజా అందాలు ఉర్రూతలూగించాయి. అంతకు మించి ఉండేలా పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. చాలా మంది హీరోయిన్లని అనుకున్న తర్వాత సుకుమార్ సమంతని ఓకే చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.  

Also Read: RRR మూవీపై తీవ్ర ప్రభావం నిజమే, కోర్టుకి వెళ్లడం లేదు.. డైరెక్ట్ గా సీఎం జగన్ తోనే..

నాగ చైతన్యతో విడిపోయాక సమంత సమంత జోరుగా సినిమాలు అంగీకరిస్తుంది. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం షూటింగ్ పూర్తయింది. విడాకుల బాధ నుంచి బయటపడి సినిమాలతో ఫుల్ బిజీ కావాలని సమంత ప్రయత్నిస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంత నేషనల్ వైడ్ గా కూడా పాపులర్ అయింది. ఈ అంశం పుష్ప పాన్ ఇండియా రిలీజ్ కు ఉపయోగపడనుంది. 

Also Read: నభా నటేష్ హాట్ షో చూశారా.. ఇంటర్నెట్ లో మంటలే, థైస్ అందాలు అదరహో

Follow Us:
Download App:
  • android
  • ios