ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దీపిక పెళ్లి చీరను డిజైన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అతడు ఆ చీరని తాను డిజైన్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. ముఖర్జీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే కొందరు దీపిక పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

అంతేకాదు.. దీపిక ధరించిన రెడ్ కలర్ సారీ సబ్యసాచి డిజైన్స్ లో ఒకటని క్యాప్షన్ ఇచ్చారు. కానీ ఇది సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన చీర కాదని దీపిక తల్లి ఉజ్జాల పదుకోన్ బెంగుళూరులో అంగడి గలేరియాలో ఈ చీరని కొనుగోలు చేరినట్లు ఓ ఆన్ లైన్ పోర్టల్ వెల్లడించింది. దీంతో సోషల్ మీడియాలో సబ్యసాచిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

దీంతో సబ్యసాచి అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ''దీపిక పెళ్లి చీరని ఆమె తల్లి ఉజ్జాల పదుకోన్ బెంగుళూరులో అంగడి గలేరియాలో  కొనుగోలు చేశారు. పెళ్లి కానుకగా ఆమె దీపిక ఆ చీరని బహుమతిగా ఇచ్చారు. చీరకి సంబంధించిన క్రెడిట్ అంగడి గలేరియాకే చెందుతుంది'' అని వెల్లడించారు. నవంబర్ 14, 15 తేదీల్లో దీపిక, రణవీర్ ల వివాహం జరిగింది నిన్న బెంగుళూరులోఈ జంట గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. 

ఇవి కూడా చదవండి.. 

స్టేజ్ పై దీపిక చీర కొంగుని సరిచేస్తూ..!

ఫొటోస్: రణ్ వీర్ దీపిక పదుకొనె వెడ్డింగ్ రెసెప్షన్ - సెలబ్రేటిస్

ఫొటోస్: రణ్ వీర్ దీపిక పదుకొనె వెడ్డింగ్ రెసెప్షన్

దీపిక,రణవీర్ లు ఉండబోయే ఇల్లు ఖరీదు ఎంతంటే..?

దీపిక వెడ్డింగ్ రింగ్ రేటెంతో తెలుసా..?

ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైన రణ్ వీర్ - దీపిక..రేపు మరో పెళ్లి!

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!