బాలీవుడ్ మోస్ట్ పాపులర్ సెలబ్రేటిస్ లో ఒకరైన దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ పెళ్లికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట చాలా వరకు రిలేషన్ ను సీక్రెట్ గా మెయింటైన్ చేసింది. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పట్టించుకునే వారు కాదు. కానీ ఫైనల్ గా ఇటీవల పెళ్లి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

ఆ వార్త ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 14-15వ తేదీన వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరగానుంది. అసలు విషయంలోకి వస్తే పెళ్లి తరువాత ఈ జంట కొత్త ఇంటికి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అందుకోసం వారి డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులు కూడా ఉపందుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ వస్తోంది. దాదాపు 70కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం దీపికా బెంగుళూరులో ఉంటుండగా రణ్వీర్ ముంబైలో ఉంటున్నాడు. ఇక వివాహం అనంతరం ముంబైలోని ఒక ప్రధానమైన ఏరియాలో నిర్మిస్తున్న భవనంకు కొత్త జంట షిఫ్ట్ కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదివరకే ఆ పరిసర ప్రాంతంలో షారుక్ 70కోట్లతో ఇంటిని నిర్మించుకోగా ఇప్పుడు ఈ జోడి అలాంటి భవనం కోసం ఎదురుచూస్తోంది.