బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక, రణవీర్ లు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇండియా తిరిగొచ్చిన ఈ జంట బెంగుళూర్, ముంబైలలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంది.

ముందుగా బెంగుళూరులో తొలి రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు నూతన దంపతులు, ఇరు కుంటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుక కోసం రణవీర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న బ్లాక్ కలర్ షేర్వానీ ధరించగా.. దీపిక బంగారపు రంగు చీర ధరించి సింపుల్ గా దక్షిణాది స్టైల్ లో రెడీ అయింది.

అయితే వేదికపై నిలబడిన సందర్భంలో దీపిక తన చీర కొంగుతో ఇబ్బంది పడగా.. రణవీర్ వెంటనే ముందుకొచ్చి ఆమె చీర కొంగుని సరిచేస్తూ తన భార్యకి సహాయం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ రిసెప్షన్ లో దక్షిణాది వంటకాలను అతిథులకోసం తయారు చేయించారు. నవంబర్ 28, డిసంబర్ 1న మరో రెండు సార్లు ముంబైలో ఈ జంట రిసెప్షన్ ఏర్పాటు చేయనుంది.  

ఇవి కూడా చదవండి.. 

ఫొటోస్: రణ్ వీర్ దీపిక పదుకొనె వెడ్డింగ్ రెసెప్షన్ - సెలబ్రేటిస్

ఫొటోస్: రణ్ వీర్ దీపిక పదుకొనె వెడ్డింగ్ రెసెప్షన్

దీపిక,రణవీర్ లు ఉండబోయే ఇల్లు ఖరీదు ఎంతంటే..?

దీపిక వెడ్డింగ్ రింగ్ రేటెంతో తెలుసా..?

ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైన రణ్ వీర్ - దీపిక..రేపు మరో పెళ్లి!

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!