బాలీవుడ్ కపుల్ దీపిక పదుకొన్, రణవీర్ సింగ్ లు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలో సింధి, కొంకణి సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

పెళ్ళైన తరువాత వీరు ఎక్కడ ఉండబోతున్నారనే విషయంపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోకి ఖరీదైన ప్రాంతం జుహులో దీపిక-రణవీర్ లు ఓ ఇల్లు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఫర్నీచర్ వర్క్, ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఇటలీలో ఉన్న ఈ జంట ఇండియాకి రాగానే ఈ ఇంట్లోనే కాపురం పెట్టనున్నారు. ఈ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..? అక్షరాల రూ.50 కోట్లు. అన్ని వసతులతో కూడిన ఈ ఇంటిని దీప్-వీర్ జంట ఎంతో ఇష్టంతో కొనుక్కునట్లు తెలుస్తోంది. 

ఈ నెల 21న బెంగుళూరులో భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. అలానే డిసంబర్ 1న ముంబైలో మరో భారీ రిసెప్షన్ పెట్టబోతున్నారు. 
 

ఇవి కూడా చదవండి.. 

దీపిక వెడ్డింగ్ రింగ్ రేటెంతో తెలుసా..?

ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైన రణ్ వీర్ - దీపిక..రేపు మరో పెళ్లి!

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!