బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ లు వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15 తేదీల్లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటికానున్నారు. వీరి వివాహం ఇటలీలో జరగనుంది. 

ఇప్పుడు ఈ పెళ్లికి ఎవరు హాజరు కాబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. దీపిక, రణవీర్ లకు సన్నిహితులైన వారు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. బాలీవుడ్ నుండి కొందరు స్టార్లకు ఈ జంట వెడ్డింగ్ కార్డ్ అందించింది. కానీ హీరోయిన్ కత్రినాకి మాత్రం కార్డ్ అందలేదని సమాచారం. 

ఇటీవల ఓ షోలో పాల్గొన్న కత్రినా.. దీపిక, రణవీర్ ల వెడ్డింగ్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నట్లు, వారి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉందని వెల్లడించింది. కానీ దీపక మాత్రం కత్రినాకి కార్డ్ ఇవ్వలేదట. దానికి కారణం కత్రినా,రణబీర్ కపూర్ లు విడిపోయిన తరువాత రణబీర్ తో దీపిక కొన్నాళ్లు డేటింగ్ చేసింది.

ఆ సమయంలో దీపిక, కత్రినాల మధ్య ఏవో విబేధాలు చోటుచేసుకున్నాయని బాలీవుడ్ జనాలు అంటుంటారు. కత్రినా కూడా రణబీర్, దీపికా, అలియాలతో తన కెమిస్ట్రీ వ్యక్తిగతంగా విభిన్నంగా ఉంటుందని అంటారు. పెర్సనల్ గా ఉన్న గొడవల కారణంగానే దీపికా వెడ్డింగ్ కార్డ్ కత్రినాకి అందలేదని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!