బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే, రణవీర్ సింగ్ లు పెళ్లి చేసుకోబోతున్నసంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వెల్లడించారు.

నవంబర్ 14, 15 తేదీల్లో వివాహం ఉంటుందని తెలిపారు. ఇటలీలోని లేక్ కోమోలో వీరి వివాహ వేడుక జరగనుంది. పెళ్లికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ జంట ఇప్పుడు ఇటలీకి పయనమైంది.

ఈరోజు ఉదయం ఇద్దరూ విడివిడిగా తెల్లని దుస్తుల్లో ముంబైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. సడెన్ గా దీపిక,రణవీర్ లు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో అభిమానులు వారి చూట్టు గుమ్మిగూడారు. తమ కెమెరాల్లో దీపిక, రణవీర్ లను బంధించే ప్రయత్నం చేశారు.

దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ నవ్వుతూ అందరికీ హాయ్ చెప్తూ వెళ్లిపోయారు.  

ఇవి కూడా చదవండి.. 

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!