బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్, దీపిక పదుకొన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ జంట తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. నవంబర్ 14, 15 తారీఖులలో తమ వివాహం జరగబోతుందంటూ ఆదివారం వెల్లడించారు.

ఈ ప్రకటనతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇటలీలో లేక్ కోమోలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. అయితే నవంబర్ 15నే వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఓ కారణం ఉందట.

అదేంటంటే.. వీరిద్దరూ జంటగా నటించిన మొదటి సినిమా 'రామ్‌లీలా' సినిమా 2013లో నవంబర్ 15నే విడుదలైంది. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమని ఒకటి చేసిన ఈ సినిమాని గుర్తుచేసుకుంటూ సినిమా విడుదలైన రోజునే వివాహ తేదీని నిర్ణయించారని తెలుస్తోంది.

వీరిద్దరి పెళ్లి రెండు పద్దతుల్లో జరగనుందని అంటున్నారు. దీపిక బెంగుళూరుకి చెందిన అమ్మాయి దీంతో దక్షిణ భారతీయ సంప్రదాయంలో ఒకసారి, రణవీర్ సింధీ కుటుంబంలో పుట్టడంతో సింధి సంప్రదాయంలో వివాహాలు జరపనున్నారు.  

సంబంధిత వార్త.. 

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!