గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ లవర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న దీపికా పదుకొనె - రన్ వీర్ సింగ్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కొన్ని రోజులుగా ఇటలీలో వీరి వివాహ వేడుకలకు సంబందించిన ఈవెంట్స్ వరుసగా జరిగాయి. నిన్న మెహేంది ఫంక్షన్ కూడా ఘనంగా జరిగింది. 

ఇక నేడు ఇటలీలోని ప్రముఖ లేక్ కోమోలో రణవీర్‌సింగ్, దీపిక పదుకొనెల వివాహం జరిగింది. ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం రెండు సార్లు వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు కొంకణి ఆచారంలో రన్ వీర్ దీపికను మనువాడాడు. రేపు సింధు సాంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక నేడు జరిగిన పెళ్లి వేడుకలో కేవలం కొద్దీ మాత్రమే పాల్గొన్నారు. ఇరు కుటుంబాలకు సంబందించిన ముఖ్యమైన వారే వేడుకలో ఉన్నట్లు తెలిసింది. 

ఇక రణ్వీర్ కి దీపికకు దగ్గరగా ఉండే కొంత మంది సినీ ప్రముఖులు కూడా వేడుకలో ఉన్నట్లు సమాచారం. ఇక రేపు అదే వేదికలో మకరోసారి రణ్వీర్ తన ఆచార పద్దతిలో దీపికను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఈ నూతన జంటకు విషెస్ అందిస్తున్నారు.