బాలీవుడ్ స్టార్ హీరో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ లు పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితమే ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. నవంబర్ 14, 15 తారీఖులలో హిందూ, సింధీ సంప్రదాయాల ద్వారా వివాహ బంధంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. 

అయితే వీరి పెళ్లి సందడి మొదలైపోయింది. శుక్రవారం నాడు దీపిక ఇంట్లో తొలి పూజా కార్యక్రమం జరిగింది. బెంగుళూరులోని తన తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితుల సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను దీపిక స్తైలిష్ట్ షలీనా నథాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో దీపిక ఆరెంజ్ కలర్ సల్వార్ సూట్ లో మెరిసిపోతుంది. ఈ వేడుకలో దీపిక హెయిర్ స్టైలిస్ట్ గేబ్రియల్ జార్జయో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి!

ఇవి కూడా చదవండి.. 

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!