Asianet News TeluguAsianet News Telugu

మరో 'డర్టీపిక్చర్' అవుతుందా..?

గతంలో నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'డర్టీపిక్చర్' సినిమాను రూపొందించారు. ఇప్పుడు మరో అడల్ట్ యాక్ట్రెస్ జీవితంతో సినిమా రూపొందబోతుంది. అదే నటి షకీలా బయోపిక్. ఆమె గురించి తెలియనివారుండరు అనడంలో అతిశయోక్తి లేదు

Richa Chadda to star in Shakeela's biopic

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల జీవితాల ఆధారంగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్నారు మేకర్స్. దీంతో మిగిలిన దర్శకులు కూడా బయోపిక్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రికెటర్స్, సినిమా నటులు, స్పోర్ట్స్ ఇలా రంగాల్లో క్రేజ్ తెచ్చుకున్న వారి బయోపిక్స్ ను రూపొందిస్తున్నారు.

గతంలో నటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'డర్టీపిక్చర్' సినిమాను రూపొందించారు. ఇప్పుడు మరో అడల్ట్ యాక్ట్రెస్ జీవితంతో సినిమా రూపొందబోతుంది. అదే నటి షకీలా బయోపిక్. ఆమె గురించి తెలియనివారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. మలయాళంలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా ఆమె సినిమాలు నిలిచేవి. కొన్నాళ్లకు ఆమె క్రేజ్ తగ్గడంతో సినిమాలలో అవకాశాలు కూడా తగ్గాయి. 

ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా.. ఆమెకు సరైన అవకాశాలు మాత్రం లభించడం లేదు. ఇప్పుడు ఈమె జీవితం ఆధారంగా సినిమా రూపొందిస్తోన్న దర్శకనిర్మాతలు మొదట హ్యూమా ఖురేషి, స్వర భాస్కర్ వంటి నటులను తీసుకోవాలనుకున్నారు. కానీ తాజాగా షకీలా పాత్రలో రిచా చద్దాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దీనికోసం రిచా మలయాళం నేర్చుకునే పనిలో పడింది. అలానే షకీలాతో కూడా ఆమె మాట్లాడినట్లు సమాచారం. మరి ఈ బయోపిక్ కూడా మరో 'డర్టీపిక్చర్' అవుతుందేమో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios