MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

The Red Bag Movie Review: మహిళా నేపథ్యంలో రూపొందిన స్టయిలీష్‌ ఫిల్మ్ `ది రెడ్‌ బ్యాగ్‌`. మహిళలకు సంబంధించి మంచి సందేశం అందించిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

4 Min read
Author : Aithagoni Raju
Published : Aug 21 2026, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ రివ్యూ
Image Credit : Asianet News

ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ రివ్యూ

మహిళా నేపథ్యంలో సినిమాలు అడపాదడపా వస్తున్నాయి. తాజాగా `ది రెడ్‌ బ్యాగ్‌` అనే చిత్రం రూపొందింది. ఇందులో హీరోయిన్లు రాధ్య, మోనిక, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించగా సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్రలో కనిపించారు. క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్, రివేంజ్ థ్రిల్లర్ మూవీ `ది రెడ్ బ్యాగ్`ని రూపొందించారు దర్శకుడు రవి కుమార్ సీరపు. మెమొరీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. క్రైమ్, గ్లామర్, సస్పెన్స్‌తోపాటు మహిళా శక్తి, మాతృత్వం వంటి అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు శుక్రవారం(ఆగస్ట్ 21)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రివేంజ్ డ్రామా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? అనేది రివ్యూలో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ కథ
Image Credit : Asianet News

ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ కథ

అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో ఉన్న ఓ పబ్‌లో విన్ని (రాధ్య) డ్యాన్సర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఆ పబ్ సాధారణమైనది కాదు. దాని యజమాని మైక్ (కబీర్ సింగ్) అత్యంత క్రూరమైన వ్యక్తి. తన స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మాయిలను అడ్డుపెట్టుకుని అక్రమ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. ఓ ద్వీపంలో భారీ రిసార్ట్, పబ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ఈషా, ఈవ్, బేబ్ అనే ముగ్గురు భారతీయ అమ్మాయిలు కూడా మైక్ నిర్వహించే చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. అసలు వీరు భారతదేశం నుంచి అరిజోనాకు ఎందుకు వెళ్లారు? విన్ని ఈ చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చింది? మైక్ చేతిలో బంధీలుగా మారిన ఈ నలుగురు యువతులు అతడి చెర నుంచి ఎలా బయటపడ్డారు? వారి జీవితాల్లోకి వచ్చిన ‘రెడ్ బ్యాగ్’ అసలు ఏమిటి? ఆ బ్యాగ్‌ కథేంటి? ఇందులో సీనియర్‌ నటి రాశీ పాత్రేంటి? మహిళలకు సంబంధించి ఇచ్చిన సందేశమేంటి? అనేది మిగిలిన సినిమా కథ.

Related Articles

Related image1
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Related image2
Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
36
ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ ఎలా ఉందంటే?

నలుగురు అమ్మాయిలు లైఫ్‌ కోసం చేసిన పోరాటాన్ని, ఓ తల్లిని కాపాడేందుకు పడ్డ స్ట్రగుల్స్ ని ఆవిష్కరించే మూవీ `ది రెడ్‌ బ్యాగ్‌`. అయితే కుటుంబ పోషణ కోసం ఒక తల్లి పడ్డ బాధని ఆవిష్కరించే మూవీ, అమ్మ విలువని తెలియజేసే మూవీ అవుతుంది. క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో పాటు రివేంజ్ డ్రామాను కలిపి దీన్ని రూపొందించారు. కథాంశం కొత్తగా అనిపించకపోయినా దర్శకుడు రవి కుమార్ సీరపు దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా స్టైలిష్ టేకింగ్, గ్లామర్ ఎలిమెంట్స్, యాక్షన్, సస్పెన్స్‌ను కథలో మిక్స్ చేశారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగుతుంది. పబ్ వాతావరణం, అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ దర్శకుడు కథను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తారు. అయితే కథలోకి ముగ్గురు అమ్మాయిల ఫ్లాష్‌బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను, గతంలో జరిగిన సంఘటనలను కలుపుతూ సాగే స్క్రీన్‌ప్లే ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ కథపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. ఆ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడుతుంది. ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్ టైమ్ మధ్య సాగే బ్యాక్ అండ్ ఫోర్త్ నెరేషన్ కథను ఆసక్తికరంగా నడిపిస్తుంది.

సెకండాఫ్‌ ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీక్వెన్సులతో సాగుతుంది. విలన్‌ చెర నుంచి బయటపడేందుకు వాళ్లు పడే బాధని ఆవిష్కరిస్తుంది. ఆయా సీన్లు ఎంగేజింగ్‌గా, ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. నలుగురు మహిళలు తమపై జరిగిన అన్యాయానికి ఎదురు నిలిచే విధానాన్ని దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. రివేంజ్ డ్రామాతో పాటు మహిళా శక్తిని ప్రధానంగా ప్రొజెక్ట్ చేయడం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో మాతృత్వానికి ఉన్న విలువను దర్శకుడు సున్నితంగా ఆవిష్కరించారు. ఒక తల్లి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు, ఆమె తీసుకునే నిర్ణయాలను సమాజం ఏ విధంగా చూస్తుంది అనే అంశాలను భావోద్వేగంతో చూపించే ప్రయత్నం చేశారు. అయితే సినిమా చాలా స్లోగా రన్‌ అవుతుంది. కమర్షియల్‌ అంశాలు మిస్‌ అయ్యాయి. డ్రామా, ఎమోషన్స్ పండలేదు. చాలా డ్రైగా ఉంటుంది. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. టేకింగ్‌ పరంగా వీక్‌గా ఉంది. సస్పెన్స్ అంశాలు తేలిపోయాయి. చెప్పాలనుకున్న విషయం పక్కదారిపట్టేలా ఉంది. కథనంలో క్లారిటీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆర్టిస్ట్ లు కూడా నటన పరంగా ఇంకా బాగా చేయాల్సింది. డబ్బింగ్‌ పరంగా లోపాలున్నాయి. బీజీఎం అంతగా లేదు. పాటలు బాగున్నాయి. కాకపోతే ఇదొక స్టయిలీష్‌ ఫిల్మ్ గా నిలుస్తుంది.

46
ది రెడ్‌ బ్యాగ్‌లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

ది రెడ్‌ బ్యాగ్‌లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

విన్ని పాత్రలో రాధ్య తన నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించింది. మిగతా ముగ్గురు హీరోయిన్లు మోనిక, ఆకాంక్ష కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. తెరపై గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తమ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. విలన్ మైక్ పాత్రలో కబీర్ సింగ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించారు. క్రూరమైన వ్యక్తిగా ఆయన నటన కథకు తగ్గట్టుగా సాగింది. ప్రసాద్ బెహరా తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ కామెడీ పండలేదు. గాయత్రి భార్గవి నటించిన సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. సీనియర్ హీరోయిన్ రాశి పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.. కథపై బలమైన ప్రభావం చూపిస్తుంది. మిగిలిన వారు ఓకే అనిపించారు. కాకపోతే ప్రధాన పాత్రల్లో నటించిన అమ్మాయిలు కొత్త కావడంతో కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది.

56
ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

ది రెడ్‌ బ్యాగ్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. రిచ్‌గా ఉన్నాయి. యాక్షన్, ఛేజింగ్ సీన్లలో కూడా కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ లోపాలున్నాయి. చాలా వీక్‌గా ఉంది. మ్యూజిక్‌ బాగుంది. పాటలు అదిరిపోయాయి. పెద్ద సినిమా స్థాయిలో ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా చాలా రిచ్‌గా ఉంది. దర్శకుడు మంచి పాయింట్‌ తీసుకున్నారు. కానీ దాన్ని అంతే బాగా, ఎమోషనల్‌గా, నాటకీయంగా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఇచ్చిన సందేశం బాగుంది. అమ్మాయిలకు, మహిళలకు నచ్చేలా తెరకెక్కించారు. మొత్తంగా చూస్తే ది రెడ్ బ్యాగ్ క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, రివేంజ్, థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన సినిమా. గ్లామర్, యాక్షన్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే మహిళా శక్తి, మాతృత్వం, సమాజం తీరు వంటి భావోద్వేగ అంశాలను కూడా కథలో భాగం చేశారు.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

గ్లామర్‌తో పాటు క్రైమ్, సస్పెన్స్, రివేంజ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మెప్పించే మూవీ అవుతుంది. చివర్లో మహిళల పోరాటం, మాతృత్వం చుట్టూ దర్శకుడు తీసుకున్న ఎమోషనల్‌ పాయింట్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
సినిమా సమీక్షలు
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Recommended image2
Irumudi Review: ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved