- Home
- Entertainment
- Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్, రామ్‌చరణ్ కి మహేష్ షాక్.. ఇండియా టాప్ హీరో ఎవరంటే?
Indian Top 10 Heroes: దుమ్ములేపిన అల్లు అర్జున్, రామ్‌చరణ్ కి మహేష్ షాక్.. ఇండియా టాప్ హీరో ఎవరంటే?
ఇండియన్ టాప్ 10 హీరోల జాబితా వచ్చేసింది. జులై నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్, విజయ్, మహేష్ బాబు స్థానాలు మారిపోయాయి. ఎన్టీఆర్ లిస్ట్ లోకి వచ్చారు.

ఇండియా టాప్ 10 హీరోలు
ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే.
ప్రభాస్ ని కొట్టేవారే లేరు
మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు.
దూసుకొచ్చిన అల్లు అర్జున్
రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు.
రామ్ చరణ్‌కి ఝలక్ ఇచ్చిన మహేష్ బాబు
ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. కాకపోతే చరణ్, మహేష్ ఒక్క స్థానం అటు ఇటుగా అక్కడే తిష్ట వేసుకొని ఉండటం విశేషం. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో `వారణాసి` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
మళ్లీ లిస్ట్ లోకి వచ్చిన ఎన్టీఆర్
జూన్‌లో ఏడో స్థానంలో ఉన్న సూర్య జులైలో కూడా అదే స్థానంలో ఉన్నారు. ఆయన ప్లేస్‌లో మార్పు లేదు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో అలరిస్తున్నారు. ఆగస్ట్ లో పుంజుకునే అవకాశం ఉంది. ఇక 8వ స్థానంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉన్నారు. తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. పదో స్థానంలోకి ఎన్టీఆర్ వచ్చారు. జూన్‌లో అసలు లిస్ట్ లోనే స్థానం కోల్పోయిన తారక్ .. జులైలో మాత్రం మళ్లీ లిస్ట్ లోకి రావడం విశేషం.

