రేణుదేశాయ్ దాగుడుమూతలు!

renudesai is still hiding her new husband
Highlights

ప్రస్తుతం అమెరికా పర్యట్నంలో ఉన్న ఆమె అక్కడ తనకు కాబోయే భర్తతో ఫోటో దిగింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అందులో ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. ఈ దాగుడుమూతలు ఇంకెంతకాలం రేణు అంటూ అభిమానులు ఆమె భర్త ఫోటో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగా పాపులర్ అయింది రేణుదేశాయ్. కానీ పెళ్లైన కొన్నేళ్లకే తన భర్త నుండి విడిపోయింది. ఆ తరువాత పవన్ వేరే పెళ్లి చేసుకోవడం రాజకీయాల్లో బిజీ అవ్వడం జరిగిపోయాయి. అయితే విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకు రేణు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

తనకు నిశ్చితార్ధం జరిగినట్లుగా మాత్రం ఆ వేడుక దృశ్యాన్ని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో జనాలు తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేయమని ఎంతగా అడుగుతున్నా రేణు మాత్రం ఆ విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచేశారు. తాజాగా రేణు మరో ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యట్నంలో ఉన్న ఆమె అక్కడ తనకు కాబోయే భర్తతో ఫోటో దిగింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ అందులో ఆ వ్యక్తి ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది.

ఈ దాగుడుమూతలు ఇంకెంతకాలం రేణు అంటూ అభిమానులు ఆమె భర్త ఫోటో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేణు రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం, పవన్ మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆయన అభిమానులకు ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. 
 

loader