ఆర్ఎక్స్ 100 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీటెక్కించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరోసారి తన గ్లామర్ తో వెండితెరను ఎటాక్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ RDXలవ్ అనే సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా మరికొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా టీజర్ ని విడుదల చేసి ఓ వర్గం ఆడియెన్స్ ని చిత్ర యూనిట్ ఎట్రాక్ట్ చేసింది. 

రొమాన్స్ డోస్ ఎక్కువైనట్లు డైలాగ్స్ తో అర్ధమవుతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ డోస్ గట్టిగానే ఉంది. ఇక పాయల్ గ్లామర్ షో టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో బేబీ ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో ఇప్పుడు కూడా అదే తరహాలో మెరిసింది. దీంతో టీజర్ నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.