MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Spider Man Brand New Day: అదిరిపోయే యాక్షన్‌ అండ్‌ విజువల్‌ ట్రీట్‌తో `స్పైడర్‌ మ్యాన్‌ 4` ట్రైలర్‌

Spider Man Brand New Day: అదిరిపోయే యాక్షన్‌ అండ్‌ విజువల్‌ ట్రీట్‌తో `స్పైడర్‌ మ్యాన్‌ 4` ట్రైలర్‌

Spider Man Brand New Day Trailer: స్పైడర్‌ మ్యాన్‌ మూవీస్‌కి మన ఇండియాలో విశేష అభిమానులు ఉన్నారు. ఆయా చిత్రాలు ఇక్కడ మంచి ఆదరణ పొందుతాయి. ఈ క్రమంలో ఇప్పుడు స్పైడర్‌ మ్యానర్‌ బ్రాండ్‌ న్యూ డే మూవీ రాబోతుంది. తాజాగా దీని ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 19 2026, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్పైడర్‌ సిరీస్‌ నుంచి మరో సీక్వెల్‌
Image Credit : Asianet News

స్పైడర్‌ సిరీస్‌ నుంచి మరో సీక్వెల్‌

స్పైడర్‌ మ్యాన్‌ మూవీస్‌ కి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ చిత్రాలను చూసి ఎంజాయ్‌ చేస్తారు. మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్ లో నుంచి వస్తోన్న మరో సిరీస్‌ `స్పైడర్‌ మ్యాన్‌`.  స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌లోని చిత్రాలు అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‌ నుంచి సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. చివరగా 2021లో `స్పైడర్‌ మ్యాన్‌ నో వే హోమ్‌` అనే మూవీ వచ్చింది. అది 1.92 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లని వసూలు చేసింది.

24
స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ నుంచి నాల్గో సీక్వెల్‌
Image Credit : Asianet News

స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ నుంచి నాల్గో సీక్వెల్‌

ఈ క్రమంలో తాజాగా ఈ స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ నుంచి నాల్గో మూవీ వస్తోంది. `స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే` పేరుతో దీన్ని రూపొందించారు. దీనికి డెస్టిన్‌ డానియల్‌ క్రిట్టన్‌ దర్శకత్వం వహించగా, టామ్‌ హోలాండ్‌, జెండయా, సాడీ సింక్‌, జాకబ్‌ బటలాన్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ విడుదలయ్యింది. ఈ సినిమా ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హోలాండ్‌ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Related Articles

Related image1
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?
Related image2
Dhurandhar 2 Collection: ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు వసూళ్లు.. అన్ని సినిమా రికార్డులు బద్దలు
34
స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే ట్రైలర్‌ ఎలా ఉందంటే
Image Credit : Asianet News

స్పైడర్‌ మ్యాన్‌ బ్రాండ్‌ న్యూ డే ట్రైలర్‌ ఎలా ఉందంటే

‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్స్ బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేయడానికి రాబోతుంది. 'నో వే హోమ్' సంఘటనలు జరిగి ఐదేళ్లు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో నేరాలతో పోరాడుతూ, సిటీని రక్షించడానికి ఒక ఫుల్-టైమ్ స్పైడర్ మ్యాన్‌గా పూర్తిగా అంకితమయ్యాడు. అయితే అతనిపై బాధ్యతలు, ఒత్తిడి పెరిగేకొద్దీ.. ఊహించని శారీరక మార్పులు అతని మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వింతైన నేరాల పరంపర అతనెన్నడూ ఎదుర్కోనంతటి అత్యంత శక్తివంతమైన విలన్ ముప్పుకు దారితీస్తుంది. మరి దీన్ని స్పైడర్‌ మ్యాన్‌ ఎలా ఎదుర్కొన్నాడు, సరికొత్త విలన్లని ఎదుర్కొనేందుకు ఆయన ఎలా రెడీ అయ్యాడు? ఈ సారి తన పోరాటం ఎలా సాగిందనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగబోతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

44
జులై 31న రాబోతున్న స్పైడర్‌ మ్యాన్‌ 4
Image Credit : Asianet News

జులై 31న రాబోతున్న స్పైడర్‌ మ్యాన్‌ 4

ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలండ్ నటిస్తుండగా, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో, ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, జూలై 31న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది. తాజా ట్రైలర్‌ మూవీపై అంచనాలను పెంచింది. విజువల్స్ పరంగా కనువిందు చేస్తుంది. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తర్వాత చిరంజీవి మరో సంచలన నిర్ణయం..ఆ హీరో స్ఫూర్తితోనే, అలాంటోడు ఒక్కడుంటే చాలు
Recommended image2
చిరంజీవి ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో, బాలకృష్ణ రిక్వస్ట్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా
Recommended image3
Dhurandhar 2 Collection: ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు వసూళ్లు.. అన్ని సినిమా రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?
Recommended image2
Dhurandhar 2 Collection: ధురంధర్‌ 2 మూవీ మొదటి రోజు వసూళ్లు.. అన్ని సినిమా రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved