మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అజర్ బైజాన్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఇంత కాలమవుతున్నా.. ఇప్పటివరకు సినిమా టైటిల్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల ఈ సినిమాకి చిరంజీవి 'స్టేట్ రౌడీ' టైటిల్ ని పెట్టారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా.. పవన్ కల్యాణ్ టైటిల్ 'తమ్ముడు' కూడా పరిశీలనలో ఉందని అన్నారు. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాత డివివి దానయ్య 'వినయ విధేయ రామ' అనే టైటిల్ నిఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

దీంతో రామ్ చరణ్ సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ అయిందంటూ సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి మొదలైంది. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా.. సినిమాలో యాక్షన్ సీన్స్ బోయపాటి స్టయిల్ లో ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.

అయితే మాస్ హీరో అయిన రామ్ చరణ్ సినిమాకి ఇలాంటి టైటిల్ ఎంతవరకు యాప్ట్ అవుతుందా.. అనేది చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది!