సముద్రఖని (#Samuthirakani) దీనికి దర్శకుడు. సముద్రఖని ఇంతకు ముందు చాలా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు, 


సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన తన సంపాదనలో ఎక్కువ శాతం దాన ధర్మాలు వినియోగిస్తారని చెప్తారు. అలాగే .. అయితే, పవన్ కళ్యాణ్ కు సంబందించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది..ఆయన టాలీవుడ్ లో అధిక రెమ్యునరేషన్తో రికార్డు సృష్టించాడు. తక్కువ రోజులు పనిచేసినందుకు అతి ఎక్కువ రెమ్యునరేషన్ పొందే భారతదేశపు ఏకైక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గా హాట్ టాపిక్ గా నిలిచారు ..ఇంతకీ ఏ సినిమాకు..ఎంత సంపాదిస్తున్నారు అనే విషయానికి వస్తే..

పవన్ కళ్యాణ్ ఈమధ్య చాలా సినిమాలు ఒప్పుకున్నాడు కానీ, ఏ సినిమా ముందు షూటింగ్ స్టార్ట్ చేస్తాడో అని అందరికి ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఆ సందేహాలన్నీ పటా పంచలు అయిపోయాయి. సముద్రఖని దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) తో కలిసి నటిస్తున్న రీమేక్ సినిమా షూటింగ్ ఈరోజు అంటే బుధవారం మొదలయింది. 

సముద్రఖని (#Samuthirakani) దీనికి దర్శకుడు. సముద్రఖని ఇంతకు ముందు చాలా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించారు, ఆ తరువాత నటుడిగా మారి చాలా సినిమాలతో నటుడిగా చాలా బిజీ అయ్యాడు. ఇప్పుడు చాలా కాలం తరువాత మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు సముద్రఖని. ఇది ఒక తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitham) కి రీమేక్.

 పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ కోసం 25 రోజులు పని చేయనున్నారు మరియు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అతనికి భారీ మొత్తంలో 80 కోట్లు రెమ్యునరేషన్ అందుకోనున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కు రూ.4కోట్లు. అతను ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తే ప్రతిరోజు 4 కోట్లు అందుకోనున్నారు. మరే ఇతర భారతీయ హీరో ఇంత భారీ పారితోషికం అందుకోలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు“తో సహా తన ఇతర ప్రాజెక్ట్‌లన్నింటినీ రీషెడ్యూల్ చేసాడు.. ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ఫిక్స్ చేసారని తెలుస్తుంది.. ఈ సినిమాను వచ్చే నెలలోగా షూటింగ్ పూర్తి చెయ్యాలని పవన్ భావిస్తున్నారట.. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు 

ఇందులో పవన్ కళ్యాణ్ (#PawanKalyan) కేవలం 20 నుండి 25 రోజులపాటు షూటింగ్ చేస్తే చాలని అంటున్నారని, అందుకని ఇది ముందు చేస్తున్నట్టుగా భోగట్టా. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్నారు, టి. జి. విశ్వప్రసాద్ (TG Viswaprasad), వివేక్ కూచిబొట్ల నిర్మాతలు.