Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కి మరో రూ.8 కోట్లు కావాలి!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. పండగ సీజన్ కావడంతో ఈ సినిమా మొత్తం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో ఎనిమిది కోట్లు రాబట్టాల్సివుందట.

NTR Wants 8 More Crores
Author
Hyderabad, First Published Oct 22, 2018, 3:48 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా దసరా కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. పండగ సీజన్ కావడంతో ఈ సినిమా మొత్తం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్లు వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో ఎనిమిది కోట్లు రాబట్టాల్సివుందట. ఇప్పటికే నైజాం లాంటి ఏరియాల్లో లాభాల బాట పట్టిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం రూ.93 కోట్లకు జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలిపి ఇంత మొత్తానికి అమ్మారు. 

కాబట్టి మరో రూ.8 కోట్లు వస్తే తప్ప బయ్యర్లు సేఫ్ జోన్ లో పడరు. ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ ఈ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా రికార్డులను తుడిచేసింది. 

టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఆరో స్థానాన్ని దక్కించుకుంది 'అరవింద సమేత'. ఈ వారం అరవింద సమేత వసూళ్లకు మరింత కీలకంగా మారింది. శుక్రవారం నాడు కూడా సరైన సినిమాలు విడుదలకు లేకపోవడంతో అరవిందకి రిపీటెడ్ ఆడియన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. 

సంబంధిత వార్తలు..

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

Follow Us:
Download App:
  • android
  • ios