'అరవింద సమేత'కి అక్కడ అవమానం!
ఓవర్సీస్ లో 'అరవింద సమేత' భారీ అంచనాల మధ్య విడుదలైంది. బయ్యర్లు ఎక్కువ మొత్తం చెల్లించి ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్నారు. సినిమాకు ఎలా లేదన్నా.. కనీసం మూడు మిలియన్ల డాలర్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

కానీ ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు. ఇప్పటివరకు ఈ సినిమా ఒక మిలియన్ ని మాత్రమే రాబట్టింది. లాంగ్ రన్ లో మహా అయితే రెండు మిలియన్లు డాలర్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
తారక్-త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ కి ఇంత తక్కువ వసూళ్లు రావడం ఒక విధంగా అవమానకరమైన విషయమనే చెప్పాలి. సినిమాపై భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా లేవు.
ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా ఆరు రోజుల్లో రూ.55.52 కోట్లను వసూలు చేసి తన సత్తా చాటుతోంది. దసరా సెలవులు కాబట్టి కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు..
'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!
త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్
అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!
అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!
అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!
అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)