చిరుత సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనా బ్యూటీ నేహా శర్మ. కెరీర్ మొదట్లోనే మెగా పవర్ స్టార్ డెబ్యూ సినిమాలో దర్శనమిచ్చిన అమ్మడు అనుకున్నంత రేంజ్ లో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఆ తరువాత కుర్రాడు అనే సినిమాలో చేసినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో నార్త్ సైడ్ ట్రయల్స్ వేసి బాగానే బిజీ అయ్యింది. 

బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ అప్పుడపుడు హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ముఖ్యంగా హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారును ఎక్కువగా ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ లో రెడ్ హాటీ చిల్లిలా ఘాటు అందాలను ప్రదర్శించింది. 

చిట్టిపొట్టి డ్రెస్సుల్లో నవ్వుతు కనిపించిన నేహా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమాతో పాటు మళయాలంలో ఒక  ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.