Asianet News TeluguAsianet News Telugu

Nayanathara: నయనతార పెళ్లి వీడియో... ప్రోమో విడుదలైంది చూశారా!

నయనతార-విగ్నేష్ శివన్ ల పెళ్లి నేషనల్ హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. దీనికి ఓ కారణం ఉంది.

nayanatara marriage documentary here is the promo
Author
First Published Aug 9, 2022, 5:11 PM IST

2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ షూటింగ్ సమయంలో నయనతార, విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ఆ చిత్ర దర్శకుడు శివన్ కావడంతో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడేళ్లుగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారు. జూన్ 9న మహాబలిపురంలో వివాహం జరిగింది. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఈ పెళ్ళికి హాజరయ్యారు. సన్నిహితులతో పాటు అతికొద్ది మంది ప్రముఖులకే ఆహ్వానం దక్కినట్లు సమాచారం. 

నయనతార-విగ్నేష్(Nayanathara-Vignesh Shivan) పెళ్లి వేడుకను డాక్యూమెంటరీగా తెరకెక్కించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో గౌతమ్ మీనన్ వాసుదేవ్ దర్శకత్వంలో ఈ డాక్యూమెంటరీ రూపొందింది. ఈ మ్యారేజ్ డాక్యూమెంటరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా నేడు దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ' 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' టైటిల్ తో డాక్యూమెంటరీ ప్రసారం కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

నయనతార వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో నెట్ఫ్లిక్స్ యాజమాన్యం సీరియస్ అయ్యారు. అగ్రిమెంట్ బ్రేక్ చేశారంటూ నయనతార దంపతులపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. ఆ వివాదం నుండి ఎలాగొలా బయటపడ్డారు. కాగా నయనతార అభిమానులు ఆమె వివాహ కార్యక్రమంలో అందమైన డాక్యూమెంటరీ రూపంలో వీక్షించనున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

పెళ్లి తర్వాత కూడా నయనతార కెరీర్ కొనసాగిస్తున్నారు. తెలుగులో ఆమె గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె చిరంజీవి సిస్టర్ గా ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే నయనతార చేస్తున్న మరొక క్రేజీ ప్రాజెక్ట్... జవాన్. ఈ బాలీవుడ్ మూవీలో ఆమె షారుక్ ఖాన్ సరసన నటిస్తున్నారు. ఆమెకు హిందిలో ఇదే మొదటి చిత్రం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios