Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ నా మిత్రుడు కాదు, వాళ్లిద్దరే నా ఫ్రెండ్స్... సంచలనంగా రాజమౌళి కామెంట్స్

ఎన్టీఆర్ తో రాజమౌళికి ఉన్న అనుబంధం గురించి తెలిసిన వారెవరైనా ఆయన లేటెస్ట్ కామెంట్స్ కి షాక్ అవుతారు. ఎన్టీఆర్ నా మిత్రుడు కాదన్న రాజమౌళి ఆ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని బాంబు పేల్చాడు. 
 

director rajamouli says ntr is not my friend but these two ksr
Author
First Published May 2, 2024, 8:48 AM IST

దాదాపు ఏక కాలంలో ఎన్టీఆర్-రాజమౌళి కెరీర్ మొదలైంది. స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కి పూర్తి స్థాయి హీరోగా రెండో చిత్రం కాగా, రాజమౌళికి మొదటి చిత్రం. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబోలో యమదొంగ, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు వచ్చాయి. రాజమౌళితో సినిమా అంటే బ్లాక్ బస్టర్. సదరు హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదు అవుతాయి. స్టార్డం వచ్చి పడుతుంది. 

కాబట్టి ప్రతి హీరోకి రాజమౌళితో ఒక సినిమా చేయాలనే కల ఉంటుంది. అలాంటి రాజమౌళి అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేశాడు. ప్రభాస్ తో మూడు, రామ్ చరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు చేశాడు. టాలీవుడ్ హీరోలందరి కంటే ఎన్టీఆర్ తో రాజమౌళి చాలా సన్నిహితంగా ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా కలిసిపోతారు. 

ఈ క్రమంలో ఎన్టీఆర్ నా మిత్రుడు కాదని రాజమౌళి చెప్పడం చర్చకు దారి తీసింది. కృష్ణమ్మ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళిని యాంకర్.. పరిశ్రమలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని అడిగింది. దాంతో ఆడియన్స్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దానికి రాజమౌళి మాట్లాడుతూ... ఎన్టీఆర్ నాకు తమ్ముడు లాంటి వాడు. మిత్రుడు కాదు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి అని అన్నారు. 

రాజమౌళి కామెంట్స్ చర్చకు దారి తీశాయి. నిజానికి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. మిత్రుడికి మించి... ఎన్టీఆర్ ని తన కుటుంబ సభ్యుడిగా రాజమౌళి అభివర్ణించాడు. కాగా ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో మరో చిత్రం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ 2 ఉందని ప్రచారం జరుగుతుండగా... వీరి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే కావచ్చు. లేదా మహాభారతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios