Asianet News TeluguAsianet News Telugu

పుష్ప పుష్ప సాంగ్ లో షూ స్లిప్పింగ్ స్టెప్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా?

పుష్ప ది రూల్ నుండి ఫస్ట్ సింగిల్ 'పుష్ప పుష్ప' విడుదల కాగా దేశాన్ని ఊపేస్తోంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన షూ స్లిప్పింగ్ స్టెప్ ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కి ఎవరు కొరియోగ్రఫీ అందించారనే చర్చ మొదలైంది. అది ఎవరో చూద్దాం... 
 

this  choreographer composed allu arjun starer puhps 2 first single pushpa pushpa ksr
Author
First Published May 2, 2024, 4:16 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నుంచి పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. కాగాఈ లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అల్లు అర్జున్ వేసిన మాస్ స్టెప్ ఒకటి  హైలెట్ గా  నిలిచింది. ఆ స్టెప్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.  పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ చెప్పు వదిలేసి వేసిన స్టెప్ అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. 

అప్పట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీవల్లి పాటకి సంబంధించిన డాన్స్ వీడియోలు, రీల్స్ తెగ హల్చల్ చేశాయి.  అంతగా అల్లు అర్జున్ మెస్మరైజ్ చేశాడు. అయితే ఇప్పుడు పుష్ప 2 నుంచి  రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ లో కూడా అలాంటి స్టెప్పులు వేసి డాన్స్  ఇరగదీసాడు  బన్నీ. ఇందులో కూడా షూ వదిలేసి వేసే స్టెప్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ మంచి డాన్సర్, ఎంతటి కఠినమైన స్టెప్ అయినా గ్రేస్ తో వేయగలడు. 

ఈ షూ స్టెప్ కూడా ఫుల్ గ్రేస్ తో అడగొట్టేశాడు. కాగా పుష్ప 2 సినిమాకు ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, విజయ్ పోలాకి, శ్రేష్టి వర్మలు డాన్స్ మాస్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. కాగా పుష్ప 2 లో షూ స్లిప్పింగ్ స్టెప్  కంపోజ్ చేసింది ఎవరంటే విజయ్ పోలాకి మాస్టర్. విజయ్ పోలాకి ఇటీవల వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బేబీ, మ్యాడ్, బబుల్ గమ్, హాయ్ నాన్న .. వంటి సినిమాల్లో అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశాడు. 

ఇప్పుడు విజయ్ పోలాకి మాస్టర్ కూడా తాను కొరియోగ్రఫీ చేసిన  పుష్ప 2 టైటిల్ సాంగ్ లో షూ స్టెప్ స్లిప్పింగ్ వేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టెప్ బాగుంది. చాలా బాగా కంపోజ్ చేశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా .. పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్, టీజర్ హైప్ పెంచేశాయి. ఆగస్టు 15న ఆరు భాషల్లో గ్రాండ్ గా పుష్ప 2 విడుదల కానుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios