బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కు పోలీసుల నోటీసులు, న్యూడ్ ఫోటో షూట్ గురించేనా..?
బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఇష్యూలో..స్టార్స్ నలుగుతూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా రణ్ వీర్ సింగ్ కు ముంబయ్ పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఎందుకంటే..?
బాలీవుడ్ లో నివురు కప్పిన నిప్పులా రగులుతూనే ఉంది రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ వ్యావహారం. ఓ మ్యాగజైన్ కోసం రణ్ వీర్ సింగ్ ఎత్తిన దిగంబర అవతారానికి భారీగా నెగెటీవ్ రిజల్స్ వచ్చాయి. కొంత మంది రణ్ వీర్ ను సపోర్ట్ చేయగా మికొంత మంది తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి.
ఇక బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై గతంలోనే పోలీస్ కంప్లైట్స్ వెళ్ళగా.. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం నెక్ట్స్ జరిగే ఇంట్రాగేషన్ కు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేశారు. ఆగస్ట్ 22న ఈ వ్యవహారంపై విచారణకు హాజరు కావాలని పోలీసులు రణ్‌వీర్‌సింగ్‌ను ఆదేశించారు.
శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాలీవుడ్ నటుడిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.ఇక విచారణంలో భాగంగా
నోటీసులు అందించేందుకు ముంబైలోని రణ్వీర్ నివాసానికి పోలీసులు వెళ్లగా ఆ టైమ్ లో రణ్ వీర్ ఇంట్లో లేరు. ఆగస్ట్ 22న న్యూడ్ ఫోటోషూట్‌పై రణ్వీర్ను ముంబై పోలీసులు ప్రశ్నించడంతో పాటు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
న్యూడ్ ఫోటోషూట్ ద్వారా రణ్ వీర్ సింగ్ మహిళల మనోభావాలను గాయపరిచాడని శ్యామ్ మంగారాం సంస్థం ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి ఉదంతాలను తీవ్రంగా వ్యతిరేకించని పక్షంలో పలువురు మిగతా హీరోలు కూడా ఇలానే చేస్తారంటూ పిర్యారు చేసింది. వారు ఇలా నగ్న ఫోటోలతో చీఫ్ పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారితే సమాజానికి ప్రమాదం ఉందని ఆ సంస్ధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేసింది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో.. రణ్ వీర్ సింగ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలిమరి.