Asianet News TeluguAsianet News Telugu

`ప్రాజెక్ట్ K` లో ప్రభాస్ క్యారక్టర్ ట్విస్టు అదే

 భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే...ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా  `ప్రాజెక్ట్ K` మేకర్స్ సినిమాలో ప్రభాస్ పాత్రపై ప్రధాన లీక్ ఇచ్చారు.

Makers hint on Prabhas  role in Project K thrills fans
Author
Hyderabad, First Published Oct 24, 2021, 3:31 PM IST

 ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం ఆ మధ్యన ప్రారంభమైంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు.   పాన్‌ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే...ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా  `ప్రాజెక్ట్ K` మేకర్స్ సినిమాలో ప్రభాస్ పాత్రపై ప్రధాన లీక్ ఇచ్చారు.

 ప్రభాస్ ప్రత్యేకమైన రోజున శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రాజెక్ట్ కె మేకర్స్ అతన్ని `సూపర్ హీరో` అంటూ ప్రశంసించడం కీలక హింట్ గా అయ్యింది. ప్రాజెక్ట్ K ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో చిత్ర టీమ్ ప్రభాస్ ని సూపర్ హీరో అని పిలవడం యాధృచ్ఛికం కాదనేది నిజం. ఇది సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఒక ప్రధాన సూచన అని భావించాలి అంటున్నారు విశ్లేషకులు.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నిజంగానే సూపర్ హీరోగా కనిపిస్తాడనే నెలరోజుల ఊహాగానాలు సాగుతుండగా.. తాజా స్పెషల్ అప్ డేట్ తో అభిమానులు థ్రిల్ కి గురయ్యారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

Also read డ్రగ్స్ కేసుతో మరోసారి వార్తల్లో 'లైగర్' హీరోయిన్ లవ్ ఎఫైర్.. వీడియో వైరల్

ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట. ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. డాని శాంచెజ్-లోపెజ్ కెమెరా వర్క్ ని అందించనున్నారు. నవంబర్ నుంచి ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.  ప్రభాస్  ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్  పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు.

Also read బిగువైన ఎద అందాలతో చీకటి గదిలో యాంకర్‌ విష్ణుప్రియా విరహ వేదన.. మరోవైపు జాకెట్‌ బటన్స్ విప్పేసి అసలైన విందు
 

Follow Us:
Download App:
  • android
  • ios