Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసుతో మరోసారి వార్తల్లో 'లైగర్' హీరోయిన్ లవ్ ఎఫైర్.. వీడియో వైరల్

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని కుదిపేస్తోంది. గతంలో చాలా వివాదాలు బాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. బడా హీరోలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ ప్రస్తుతం ముంబై డ్రగ్స్ కేసు స్టార్ హీరోల వారసుల చుట్టూ తిరుగుతోంది.

ishan khattar visits ananya panday house
Author
Hyderabad, First Published Oct 24, 2021, 3:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని కుదిపేస్తోంది. గతంలో చాలా వివాదాలు బాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. బడా హీరోలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కానీ ప్రస్తుతం ముంబై డ్రగ్స్ కేసు స్టార్ హీరోల వారసుల చుట్టూ తిరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొన్ని వారాల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు. 

డ్రగ్స్ వ్యవహారాల్లో Aryan Khan తో సంబంధం ఉన్న అందరిని బయటకు లాగుతున్నారు. ఆర్యన్ ఖాన్ తో యంగ్ బ్యూటీ Ananya Panday వాట్సాప్ చాట్ చేసినట్లు ఎన్సీబీ నిర్ధారించింది. దీనితో ఇటీవల ఎన్సీబీ అధికారులు అనన్యని విచారించారు. గంటల పాటు అనన్య పాండే పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అనన్య మాత్రం తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని అధికారులకు తెలిపింది. 

అవసరమైనప్పుడు తిరిగి విచారణకు హాజరు కావాలని NCB అనన్యని ఆదేశించింది. దీనితో బాలీవుడ్ ప్రముఖులు అనన్యని పరామర్శించేందుకు ఆమెకు ధైర్యం చెప్పేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆమె నివాసానికి వెళుతున్నారు. ఈ క్రమంలో అనన్య పాండే ప్రేమ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. 

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చాలా కాలంగా బాలీవుడ్ లో ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి ఆ విషయం బయట పడింది. అనన్యని పరామర్శించేందుకు ఇషాన్ ఖట్టర్ ఆమె నివాసానికి వెళ్ళాడు. ఆమె ఇంటి వద్ద ఉన్న ఫ్లవర్ షాప్ లో పూల బొకే తీసుకుని వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

క్యాజువల్ డ్రెస్ లో ఉన్న ఇషాన్.. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో పూల బొకే తీసుకున్నాడు. అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. ప్రస్తుతం అనన్య పాండే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో Vijay Devarakonda సరసన లైగర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios