Asianet News TeluguAsianet News Telugu

రణ్‌వీర్‌ సింగ్‌ షోలో జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ సందడి.. గ్లామర్‌ మెరుపులు..

బుధవారం షోలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ సందడి చేశారు. ట్రెండీ వేర్‌లో అందంగా ముస్తాబై రణ్‌వీర్‌తో కలిసి స్టేజ్‌పై హంగామా చేశారు. గ్లామరస్‌ లుక్‌లో కనువిందు చేయగా, రణ్‌వీర్‌తో వీరిద్దరు చేసిన రచ్చ ఆద్యంతం కట్టిపడేస్తుంది.

janhvi kapoor and sara ali khan hulchul in ranveer singh host the big picture show
Author
Hyderabad, First Published Oct 21, 2021, 1:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్‌ స్టయిల్‌ ఐకాన్‌ రణ్‌ వీర్‌ సింగ్‌.. ఫస్ట్ టైమ్‌ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. హోస్ట్ గా మారుతూ ఆయన `ది బిగ్‌ పిక్చర్‌` షోని రన్‌ చేస్తున్నాడు. క్విజ్‌ ప్రధానంగా సాగే ఈ రియాలిటీ షో కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. `ఎవరు మీలో కోటీశ్వరులు` షో తరహాలో ఇది కూడా డిఫరెంట్ గా సాగబోతుంది. కేవలం క్విజ్‌ మాత్రమే కాదు, అనేక భావోద్వేగాలు, మనుషుల కష్టాలను, స్ట్రగుల్స్ ని ఆవిష్కరించేలా ఈ షో ఉండబోతుందని ఇటీవల విడుదలైన ప్రోమోలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే బుధవారం షోలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు జాన్వీ కపూర్‌(Janhvi Kaporr), సారా అలీ ఖాన్‌(Sara Ali Khan) సందడి చేశారు. ట్రెండీ వేర్‌లో అందంగా ముస్తాబై రణ్‌వీర్‌తో కలిసి స్టేజ్‌పై హంగామా చేశారు. గ్లామరస్‌ లుక్‌లో కనువిందు చేయగా, రణ్‌వీర్‌తో వీరిద్దరు చేసిన రచ్చ ఆద్యంతం కట్టిపడేస్తుంది. హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం The Big Pictureలో వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరిని పట్టుకుని Ran Veer Singh ఇచ్చిన పోజులు హైలైట్‌ అవుతున్నాయి. 

ఇందులో రణ్‌వీర్ సింగ్‌ హోస్ట్ గా సిల్వర్‌ కలర్‌ లైన్స్  ఉన్న బ్లాక్‌ సూట్‌లో మెరిశాడు. ఇక జాన్వీ కపూర్‌ పీచ్‌ కలర్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా ఉంది. మేకప్‌ తక్కువగా ఉన్నా బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది జాన్వీ. మోకాళ్లకి పైకున్న గౌనులో హోయలు పోయింది. మరోవైపు సారా అలీ ఖాన్ సిల్వర్‌ కలర్‌ ఛారలున్న బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో కనువిందు చేస్తుంది. థైస్‌ చూపిస్తూ పొట్టి డ్రెసులో చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఇలా సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్‌ `ది బిగ్‌ పిక్చర్` షోకి గ్లామర్‌ హంగులు అద్దారు. షోకి గ్లామర్‌ తీసుకొచ్చారు. 

also read: `లైగర్‌` బ్యూటీ అనన్య పాండేకి ఎన్సీబీ షాక్‌.. డ్రగ్స్ కేసులో నోటీసులు..

ఇక సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ ఇద్దరు 2018లో ఒకే టైమ్‌లో బాలీవుడ్‌లోకి హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో కలిసి `కేథార్‌నాథ్‌` చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `సింబా` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ని తన అకౌంట్‌ లో వేసుకుంది. వీటితోపాటు `లవ్‌ ఆజ్‌ కల్‌`, `కూలీ నెం.1` చిత్రాలతో విజయాలను అందుకుంది. ఇప్పుడు ధనుష్‌ సరసన `అట్రాంగి రే`లో నటిస్తుంది. సారా.. సైఫ్‌ అలీ ఖాన్‌ తనయ అనే విషయం తెలిసిందే. 

మరోవైపు జాన్వీ కపూర్‌ .. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. `ధాడక్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. `ఘోస్ట్ స్టోరీస్‌`, `ఆంగ్రేజీ మీడియం`, `గుంజాన్‌ సక్సేనా`,`రూహి` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం `దోస్తానా 2`, `గుడ్‌లక్‌ జెర్రీ`, `మిలి` సినిమాలు చేస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌ ఆల్మోస్ట్ ఒకేలా సాగుతుండటం విశేషం. రణ్‌ వీర్‌ సింగ్‌ `83` చిత్రంలో నటించారు. వీటితోపాటు `జయేష్‌భాయ్‌ జోర్దార్`, `సర్కస్‌`, `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రాల్లో నటిస్తున్నారు.

also read: డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ..అసలు విషయాలను దాస్తూ.. సోషల్‌ మీడియాపై వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios